E-Paper
Advertisement

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?
Advertisement

Mohsin Naqvi – BCCI:  పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇందులో భాగంగానే దాదాపు ఏడాది కాలంగా రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగితే షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోవడం లేదు ప్లేయర్లు. 2008 నుంచి ద్వైపాక్షిక సిరీస్ లు రెండు జట్ల మధ్య రద్దు కాగా… కేవలం ఐసీసీ టోర్నమెంటులో మాత్రమే తలపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్పెషల్ డీలింగ్ కు దిగినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియాతో టెస్ట్ సిరీస్ ఆడాలన్న సంకల్పంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (PCB Chairman Mohsin Naqvi) స్కెచ్ వేశాడట. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అప్పుల్లో కూరుకుపోయింది. పాకిస్తాన్ దేశంలో అడుగుపెట్టి మ్యాచ్ లు ఆడే దమ్ము , ధైర్యం ఏ జట్టు కూడా చేయడం లేదు. ఒకవేళ పాకిస్తాన్లో పర్యటించి మ్యాచ్లు ఆడినప్పటికీ… వ్యూయర్షిప్ రావడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయం పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే బ్రాడ్ కాస్టర్లు, ఇటు రెండు జట్ల క్రికెట్ బోర్డులకు ఫుల్ ఆదాయం. ఒక్కో సెకండ్ ప్రకటన కోసం దాదాపు పది లక్షల రూపాయలు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగితే చార్జ్ చేస్తారు. అంతలా ఈ మ్యాచ్ కు క్రేజ్ ఉంటుంది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయం పెంచేలామొహ్సిన్ నఖ్వీ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహించేలా కంకణం కట్టుకున్నారట. ఇందులో భాగంగానే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో (BCCI Vice-President Rajiv Shukla) మొహ్సిన్ నఖ్వీ ప్రత్యేకంగా సమావేశమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి సమావేశం ఇంగ్లాండులో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను సమర్ధించిన రాజీవ్ శుక్లా, మోడీ ప్రభుత్వంతో మాట్లాడాలని స్పష్టం చేశారట. పాకిస్తాన్ ప్రధాని చేత నరేంద్ర మోడీకి ఫోన్ చేయించాలని.. ఇరు ప్రభుత్వాలు ఒకే చెబితే కచ్చితంగా టోర్నమెంట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారట రాజీవ్ శుక్లా. ఒకవేళ రెండు ప్రభుత్వాలు ఒప్పుకుంటే దుబాయ్ వేదికగా సిరీస్ నిర్వహించాలని కూడా సూచనలు చేశారంట. దీనికి ఓకే చెప్పిన మొహ్సిన్ నఖ్వీ.. పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గరికి ఈ ప్రతిపాదనను తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మరి దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా ? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Advertisement

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×