E-Paper
Advertisement

ICC On Pak: పాకిస్తాన్ కు మ‌రో ఎదురుదెబ్బ‌..ఆ 3 డిమాండ్లు రిజెక్ట్ చేసిన ఐసీసీ

ICC On Pak: పాకిస్తాన్ కు మ‌రో ఎదురుదెబ్బ‌..ఆ 3 డిమాండ్లు రిజెక్ట్ చేసిన ఐసీసీ
Advertisement

ICC On Pak:   ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026  ( ICC T20 World Cup 2026 ) నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడంపై ఇంకా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ పెట్టిన ఐదు డిమాండ్లల‌లో మూడుంటిని రిజెక్ట్ చేసిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉండబోదని మళ్లీ ప్రచారం జరుగుతోంది.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

పాకిస్తాన్ 3 డిమాండ్లను రిజెక్ట్ చేసిన ఐసీసీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Vs Pakistan) మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ బహిష్కరించినట్లు ఇప్పటికే పాకిస్తాన్ వెల్లడించింది. అయితే ఇండియాతో మ్యాచ్ ఆడాలంటే తమ డిమాండ్లను పరిష్కరించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB), నిన్న కొత్త డ్రామాకు తెరలేపింది. ఇందులో భాగంగానే ఐసీసీ వైస్ చైర్మన్ కూడా చర్చలు జరిపారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ పెట్టిన ఐదు డిమాండ్లలలో మూడింటిని రిజెక్ట్ చేసిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC). కేవ‌లం రెండు డిమాండ్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఐసీసీ. ఈ మేర‌కు వార్త‌లు వ‌స్తున్నాయి.

అసలు పాకిస్తాన్ పెట్టిన డిమాండ్లు ఏంటి ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ( ICC T20 World Cup 2026 )) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాలంటే కొన్ని డిమాండ్లు పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇందులో మొదటిది.. టి20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు గురైన నేపథ్యంలో ఆ బోర్డుపై ఫైన్ వేయకూడదని పాకిస్తాన్ కోరిందట. అలాగే నెక్స్ట్ జరిగే అండర్ 19 వరల్డ్ కప్ ను బంగ్లాదేశ్ లో జరిగేలా చూడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న రెండు డిమాండ్లను ఐసిసి పరిశీలన చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ ప్రతిపాదనను ICC రిజెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా, పాక్, బంగ్లాదేశ్ మధ్య ట్రై సిరీస్ పెట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరగా.. దానికి కూడా రిజెక్ట్ చేసింది ఐసీసీ. బంగ్లాదేశ్ లో ఇండియా పర్యటించడానికి కూడా రిజెక్ట్ చేసింది. అంటే ఐదు డిమాండ్లకు గాను మొత్తం మూడు డిమాండ్లకు ఐసీసీ అస్సలు ఒప్పుకోలేదు. రెండు మాత్రమే ఒప్పుకుంది. ఆ రెండు ఓకే అయితే ఇండియా తో మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ కు దిశా నిర్దేశం చేసింది ఐసీసీ.

Advertisement

 

 

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×