E-Paper
Advertisement

PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !
Advertisement

PAK VS USA: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ 12వ మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( Pakistan vs United States of America)  జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో ఇండియాను ఓడించే అంత పనిచేసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు, పాకిస్తాన్ పై మాత్రం తేలిపోయింది. పాకిస్తాన్ ముందు అమెరికా జట్టు పప్పులు ఉడకలేదు. దానికి తోడు మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ దెబ్బకు అమెరికా కుప్ప కూలింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 191 పరుగుల టార్గెట్ పెట్టింది. అయితే ఈ టార్గెట్ చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాఫ్ అయింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీంతో 20 ఓవర్లు ఆడిన అమెరికా జట్టు, 32 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ విజయంతో పాకిస్తాన్ సూపర్ 8కు వెళ్లే మార్గాలు సుగమం అయ్యాయి.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య 12వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కులంబో వేదికగా జరగగా ఇందులో 32 పరుగుల తేడాతో విజయం సాధించింది మన శత్రుదేశం పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లు ఆడింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన పాకిస్తాన్ 190 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టు తేలిపోయింది. ఇండియా పైన ఆడిన కసితో పాకిస్తాన్ పైన మాత్రం ఆడలేదు అమెరికా. దీంతో 20 ఓవర్లు ఆడిన అమెరికా జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే సాధించింది. ఈ దెబ్బకు పాకిస్తాన్ విజయం అందుకుంది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ జట్టుకు నాలుగు పాయింట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన నేప‌థ్యంలో సూప‌ర్ 8 కు వెళ్లే మార్గాన్ని సుగ‌మం చేసుకుంది పాకిస్తాన్‌.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు

పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌ తెరపైకి వస్తున్నాయి. టి20 ప్రపంచ కప్ లో ఈ మ్యాచ్ తోనే అడుగుపెట్టిన ఉస్మాన్ తారిక్‌, అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇతని బౌలింగ్ లో మొత్తం మూడు వికెట్లు పడ్డాయి. దీంతో ఉస్మాన్ తారిక్‌ బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇతనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×