E-Paper
Advertisement

Pakistan Team: క‌రాచీ ఎయిర్ పోర్టులో పాక్ ప్లేయ‌ర్ల‌కు అవ‌మానం..కుక్క కూడా దేక‌డం లేదా ?

Pakistan Team: క‌రాచీ ఎయిర్ పోర్టులో పాక్ ప్లేయ‌ర్ల‌కు అవ‌మానం..కుక్క కూడా దేక‌డం లేదా ?
Advertisement

Pakistan Team: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై భారీ పరుగుల తేడాతో గెలవాల్సిన పాకిస్తాన్… చేతులు దులుపుకుంది. దీంతో పాకిస్తాన్ ఇంటిదారి పట్టగా… న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరుకుంది. అయితే, సోమవారం ఉదయం కొలంబో నుంచి కరాచీ చేరుకుంది పాకిస్తాన్ టీమ్ ( Pakistan team). అయితే కరాచీ విమానాశ్రయంలో ( Karachi airport ) పాకిస్తాన్ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్ ఆడి వచ్చిన పాకిస్తాన్ ప్లేయర్లను చూసేందుకు అభిమానులు ఒక్కరు కూడా రాలేదు. సాధారణ ప్రయాణికుల లాగానే విమానాశ్రయంలో మెరిసారు పాకిస్తాన్ క్రికెటర్లు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ వెధ‌వ‌ల‌ను చూసేందుకు ఒక్క అభిమాని కూడా రాలేదని ఆడుకుంటున్నారు.

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

క‌రాచీ ఎయిర్ పోర్టులో పాక్ ప్లేయ‌ర్ల‌కు అవ‌మానం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో సూపర్ 8 దాకా వచ్చి ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. గ్రూప్ స్టేజ్ లో నమీబియా, నెదర్లాండ్స్ , యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి జట్ల పైన మాత్రమే విజయం సాధించి ఇంటిదారి పట్టింది. అటు గ్రూప్ స్టేజిలో టీమిండియా చేతిలో చిత్తుగా పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్ చేరుకునే క్రమంలో శ్రీలంకను 147 పరుగుల లోపు కట్టడి చేయలేక విఫలమైంది. దీంతో పాకిస్తాన్ ఇంటిదారి పట్టగా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కొలంబో నుంచి సోమవారం రోజున కరాచ విమానాశ్రయానికి చేరుకుంది పాకిస్తాన్ టీం. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లకు ఎలాంటి భద్రత కల్పించలేదు అక్కడి సర్కార్.

అలాగే ఈ ప్లేయర్లను చూసేందుకు విమానాశ్రయానికి అభిమానులు కూడా పెద్దగా రాలేదు. ఇండియాలో అయితే వేలాది సంఖ్యలో అభిమానులు విమానాశ్రయానికి చేరుకుంటారు. కానీ పాకిస్తాన్ లో అలాంటి పరిస్థితి కనిపించలేదు. పట్టుమని పదిమంది అభిమానులు కూడా రాలేదు. ఆ వచ్చిన అభిమానులు ఏకంగా పాకిస్తాన్ క్రికెటర్ల భుజాలపై చేతులు వేసి దర్జాగా ఫోటోలు దిగారు. ఇక అభిమానుల ఓవరాక్షన్ ఆపేందుకు సెక్యూరిటీ కూడా లేదు. ఈ వీడియోలు వైరల్ కావడంతో.. ఇండియన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయర్లను వాళ్ళ దేశంలో కుక్క కూడా దేకడం లేదని అంటున్నారు.

పాకిస్తాన్ ప్లేయర్లపై PCB చర్యలు

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో దారుణంగా విఫలం కావడం… ఇండియా చేతిలో గ్రూప్ స్టేజ్ లో ఓడిపోవడం కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు పూనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో పాకిస్తాన్ ప్లేయర్ 50 లక్షల రూపాయలు బోర్డుకు చెల్లించాలని ఆదేశాలు వచ్చాయని స‌మాచారం. డబ్బులు కట్టకపోతే ఇకపై జట్టులో ఆడబోరని వార్నింగ్ కూడా ఇస్తున్నార‌ని స‌మాచారం అందుతోంది.

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×