E-Paper
Advertisement

Tanvir Ahmed: టీమిండియాలో అంద‌రూ గ‌ల్లీ క్రికెట‌ర్లే.. కోహ్లీ లేక‌పోతే..ఉగాండా కంటే దారుణం

Tanvir Ahmed: టీమిండియాలో అంద‌రూ గ‌ల్లీ క్రికెట‌ర్లే.. కోహ్లీ లేక‌పోతే..ఉగాండా కంటే దారుణం
Advertisement

Tanvir Ahmed: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా దక్షిణాఫ్రికా చేతిలో కీలకమైన సూపర్ 8 మ్యాచ్లో దారుణంగా ఓడింది టీం ఇండియా. బౌలింగ్ లో పర్వాలేదనిపించినా, టీమిండియా బ్యాటర్లు మాత్రం చేతులు ఎత్తేశారు. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగులు తేడాతో చిత్తుచిత్తుగా ఓడింది టీమిండియా. అయితే టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. టీమిండియా సెమీఫైనల్ ఆశలను వదులుకోవాల్సిందేనని, సెటైర్లు పేల్చుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ ( Virat Kohli) లాంటి ప్లేయర్ లేకపోతే టీమిండియా గెలవడం కష్టమే అంటూ పాకిస్తాన్ ( Pakistan) మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanvir Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న టీమిండియా ప్లేయర్లు అందరూ చేతకాని దద్దమ్మలే అంటూ నిప్పులు జరిగారు. విరాట్ కోహ్లీ లాగా ఆడే సత్తా ఎవరి దగ్గర లేదని మండిపడ్డారు.

Also Read: Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

విరాట్ కోహ్లీ లేకపోతే ఉగాండా కంటే దారుణం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా సాగుతోంది. సూపర్ 8 మ్యాచ్ లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. అయితే, ఈ సందర్భంగా టీమిండియాలో దక్షిణాఫ్రికా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ లిస్టులో తన్వీర్ అహ్మద్ కూడా చేరిపోయాడు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమ్ ఇండియా టి20 జట్టు చాలా బలహీనంగా తయారైందని గుర్తు చేశారు. చేజింగ్ చేయాలంటే విరాట్ కోహ్లీ వల్ల మాత్రమే అవుతుందని ప్రశంసించారు తన్వీర్ అహ్మద్.

అలాంటి విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఆదివారం దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయిందని ఫైర్ అయ్యారు. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, టీమిండియా కచ్చితంగా గెలిచేది అన్నారు. కానీ ఇప్పుడు ఉన్న టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీ లాగా ఆడే సత్తా ఎవరికీ లేదని మండిపడ్డారు. గల్లీ క్రికెటర్లను తీసుకువచ్చి గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) గేమ్స్ ఆడుతున్నాడని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) కళ్ళు తెరిచి , మంచి జట్టును సెలెక్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ జట్టుతో టీమిండియా టైటిల్ గెలవడం భ్రమ అంటూ చురకలు అంటించారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

టీమిండియా సెమీ ఫైన‌ల్ చేరాలంటే ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన టీమిండియా సెమీ ఫైనల్ కు చేరాలంటే చాలా కష్టపడాలి. సూపర్ 8 లో భాగంగా వెస్టిండీస్ అలాగే జింబాబ్వేపై టీమిండియా కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా పెద్ద విజయాన్ని నమోదు చేయాలి. అలా జరిగితేనే టీమిండియా సెమీఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి.

Also Read:  Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×