E-Paper
Advertisement

PAK VS AUS: బ‌క్రీద్ పండ‌గ‌…పాకిస్తాన్ జ‌ట్టుకు PCB బంప‌ర్ ఆఫ‌ర్‌

PAK VS AUS: బ‌క్రీద్ పండ‌గ‌…పాకిస్తాన్ జ‌ట్టుకు PCB బంప‌ర్ ఆఫ‌ర్‌
Advertisement

PAK VS AUS:  పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia) మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. మే 30వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేలు ( Australia tour of Pakistan 2026) జరుగుతాయి. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లు, పాకిస్తాన్ చేరుకొని.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది PCB. మే 27వ తేదీ అంటే రేపు పాకిస్తాన్ లో బక్రీద్ పండుగ (Bakrid ) జరగనుంది. ఈ పండుగ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లందరికి హాలిడేస్ (Bakrid Holiday) ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ త‌రుణంలోనే రెండు రోజుల పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి.. మే 28వ తేదీన రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ ఉదయమే క్రికెటర్లు అందరూ తమ నగరాలకు వెళ్లిపోయారు. ఇక రేపు కుటుంబ సభ్యుల సమక్షంలో బక్రీద్ జరుపుకొని.. మళ్లీ జట్టులో చేరబోతున్నారు.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టుకు బ‌క్రీద్ హాలిడేస్

Advertisement

బక్రీద్ పండుగ పాకిస్తాన్ లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆరోజున మేకలు, ఆవులను కూడా బలిచ్చే సంస్కృతి పాకిస్తాన్ లో ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు ముస్లింలు. అయితే పాకిస్తాన్ జట్టులో అందరూ ముస్లింలు ఉన్న నేపథ్యంలో.. రెండు రోజులపాటు సెలవులు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది PCB. దీంతో ఇవాళ ఉదయం క్రికెటర్లు అందరూ.. తమ ఇంటికి వెళ్లిపోయారు. రేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన తర్వాత ఎల్లుండి తిరిగి జట్టులో చేరుతారు. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా తొలి వన్డే ఉన్న నేపథ్యంలో.. ప్లేయర్ లందరూ అక్కడికే రానున్నారు.

కొత్త కెప్టెన్ తో రంగంలోకి దిగనున్న ఆస్ట్రేలియా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో కీలక ప్లేయర్లు లేకుండానే పాకిస్తాన్ దేశంలో దిగింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. అయితే లేటెస్ట్ గా మిచెల్ మార్ష్‌ కూడా ఈ టోర్నమెంట్ కు దూరమయ్యాడు. పాకిస్తాన్ దాకా వెళ్లిన మిచెల్ మార్ష్‌ కాలుకు గాయమైంది. దీంతో ఈ టోర్నమెంట్ నుంచి అతన్ని తప్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ క్రమంలో మిచెల్ మార్ష్‌ స్థానంలో వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ ఆస్ట్రేలియా కెప్టెన్ బాధ్యతలు వహించనున్నారు. ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్ వుడ్, ప్యాట్ క‌మిన్స్ తో పాటు ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ ఆడే ఆస్ట్రేలియ‌న్స్ అంద‌రూ పాకిస్తాన్ టూర్ కు దూరంగా ఉంటున్నారు.  అంటే దాదాపుగా ఆస్ట్రేలియా B జట్టు మాత్రమే పాకిస్తాన్ తో ఆడనుందన్నమాట.

Advertisement

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×