E-Paper
Advertisement

T20 World Cup 2026: టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ ర‌ద్దు..బాయ్ కాట్ చేసేందుకు PCB కుట్ర ?

T20 World Cup 2026: టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ ర‌ద్దు..బాయ్ కాట్ చేసేందుకు PCB  కుట్ర ?
Advertisement

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ మరో కొత్త కుట్రకు తెరలేపింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ ను బాయ్ కాట్ ( IND VS PAK BoyCott) చేయాలని నిర్ణయం తీసుకుందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB). ఫిబ్రవరి 15వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs Pakistan) మధ్య కొలంబో వేదికగా గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న బంగ్లాదేశ్ డిమాండ్లపై ఐసీసీ ( ICC) ప్రవర్తించిన తీరుపై పాకిస్తాన్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన కూడా చేయనుందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇదే జరిగితే టీమిండియా కు అదనంగా రెండు పాయింట్లు రానున్నాయి.

Also Read: Yuzvendra Chahal Dating: ఛీ కొట్టిన ప్రియురాలిపై రివేంజ్‌..24 గంట‌ల్లోపే కొత్త అమ్మాయితో చాహ‌ల్ రొమాన్స్‌..మ‌గాడంటే వీడురా

టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ ర‌ద్దు..బాయ్ కాట్ చేసేందుకు PCB కుట్ర ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడం పెద్ద వివాదంగా మారింది. బంగ్లాదేశ్ లో హిందువులను చంపేస్తున్నారన్న ఒక్క కారణంతో ఐపీఎల్ ఆడకుండా ఆ దేశ క్రికెటర్ల పై బ్యాన్ విధించింది బీసీసీఐ. అయితే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రివేంజ్ తీర్చుకునేందుకు బంగ్లాదేశ్ కొత్త స్కెచ్ వేసింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని తిరకాసు పెట్టింది బంగ్లాదేశ్.

శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడతామని వెల్లడించింది. దీనికి ఐసిసి అస్సలు ఒప్పుకోలేదు. బంగ్లాదేశ్ డిమాండ్లను పక్కకు పెట్టింది ఐసీసీ. ఇలాంటి తరుణంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) ఆడబోమని వైదొలిగింది బంగ్లాదేశ్. అయితే ఈ విషయంలో బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని ఒక్క కారణం చూపించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త కుట్రకు తెర లేపింది. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ బాయ్ కాట్ చేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందట. బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

పాకిస్తాన్ ఆడ‌క‌పోతే టీమిండియాకు న‌ష్టమా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేప‌థ్యంలో టీమిండియాతో ఫిబ్ర‌వ‌రి 15 వ తేదీన జ‌రిగే మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తే, పాకిస్తాన్ తీవ్ర న‌ష్టం జ‌రుగ‌నుంది. టీమిండియా ఆడి, పాకిస్తాన్ ఆడ‌క‌పోతే 2 పాయిట్లు పాకిస్తాన్ కోల్పోనుంది. అప్పుడు విజేత‌గా టీమిండియా నిలుస్తుంది. అదే జ‌రిగితే, ఆ రెండు పాయింట్లతో టీ20 టోర్నమెంట్ నుంచే పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంటుంది.

Also Read: Jason Gillespie: ఫిక్సింగ్‌ అంటూ పాకిస్తాన్ మాజీ కోచ్ ఆరోప‌ణ‌లు..బ‌ట్ట‌లిప్పి కొడ‌తామంటూ ఇండియా వార్నింగ్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×