E-Paper
Advertisement

Wasim Akram: హైదరాబాద్‌లో వసీం అక్రమ్ విగ్రహం.. పగలబడి నవ్వుతోన్న జనం, ఎందుకంటే?

Wasim Akram: హైదరాబాద్‌లో వసీం అక్రమ్ విగ్రహం.. పగలబడి నవ్వుతోన్న జనం, ఎందుకంటే?
Advertisement

Wasim Akram:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆయనకు అరుదైన గౌరవాన్ని అందించింది. అయితే ఈ విగ్రహం ఏర్పాటును హైదరాబాద్ మహానగరంలో చేయడం గమనార్హం. అదేంటి హైదరాబాద్ మహానగరంలో వసీం అక్రమ్ అనే పాకిస్తాన్ బౌలర్ విగ్రహం పెట్టడం ఏంటని అనుకుంటున్నారా? లేదా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర వసీం అక్రమ్ విగ్రహం పెట్టారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పెద్ద పొరపాటే. పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ విగ్రహం ఏర్పాటు చేసింది… మన హైదరాబాదులో కాదు. పాకిస్తాన్ లో ఉన్న మరో హైదరాబాద్ నగరంలో… మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విగ్రహం ఏర్పాటు చేశారు.

Also Read: Luckiest Batter: అదృష్టమంటే ఇదే…వికెట్లను తాకినా నాటౌటే.. అది కూడా 98 పరుగుల వద్ద

Advertisement

హైదరాబాద్ గడ్డపై పాకిస్తాన్ క్రికెటర్ విగ్రహం

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1984 సంవత్సరం నుంచి 2003 వరకు పాకిస్తాన్ జట్టులో కీలక ప్లేయర్ గా అలాగే కెప్టెన్ గా కూడా కొనసాగారు వసిం అక్రమ్. ఆ జట్టుకు ఎన్నో విజయాలు కూడా అందించిన ఆటగాడిలో ఒకరు ఈ వసీమ్ అక్రమ్. అలాంటి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కు అరుదైన గౌరవాన్ని అందించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని నియాజ్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది.

Advertisement

ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అయితే హైదరాబాదులో వసీం అక్రమ్ విగ్రహం ఏర్పాటు చేశారని వార్త రావడంతో అందరూ తెలంగాణలోని హైదరాబాద్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో పంజాబ్ ఉన్నట్లే హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాదులోని నియాజ్ స్టేడియం పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనేక సేవలు అందించినందుకు గాను గుర్తుగా ఆయన విగ్రహాన్ని తాజాగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వసీం అక్రమ్ విగ్రహంపై జోకులు

పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విగ్రహం పోలికలపై సెటైర్లు పేల్చున్నారు. ఈ విగ్రహం 1992 ప్రపంచ కప్ జెర్సీలో ఉండడం గమనార్హం. అయితే హాలీవుడ్ నటుడు సిల్వర్ స్టార్ స్థాలోన్ తరహాలో ఈ విగ్రహం ఉందని… అసలు వసీం అక్రమ్ లాగా ఆ విగ్రహం లేదని సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read:Rohit’s Lamborghini: రోహిత్ శర్మకు అవమానం…గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్ముకున్న ఫ్యాన్ June 9,2 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×