// // Shoaib Malik : మన మనసేం చెబుతుందో అదే చేయాలి: షోయబ్ మాలిక్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Shoaib Malik : మన మనసేం చెబుతుందో అదే చేయాలి: షోయబ్ మాలిక్

Shoaib Malik : మన మనసేం చెబుతుందో అదే చేయాలి: షోయబ్ మాలిక్
Advertisement
Shoaib Malik

Shoaib Malik : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, 41 ఏళ్ల షోయబ్ మాలిక్ మూడో పెళ్లి తర్వాత తొలిసారి స్పందించాడు.  నటి సనా జావేద్‌ ను పెళ్లి చేసుకున్న వెంటనే, ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి వివాదానికి తెరతీశాడు. తర్వాత మూడు నో బాల్స్ వేసి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు గురయ్యాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి  బయటకు వచ్చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అలాగే దుబాయ్ కి జంప్ అయ్యాడనే వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంటా బయటా వివాదాలు, ట్రోలింగులతో తలబొప్పి కడుతున్న నేపథ్యంలో మళ్లీ స్పందించాడు. సానియా మీర్జాను వదిలి నటి సనా జావెద్ ను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో, మరో విధంగా చెప్పాడు. ఇంతకీ తను ఏమన్నాడంటే…

Advertisement

“నేను అందరికీ చెప్పేది ఒకటే.. మీ మనసు మీకేం చెబుతుందో అదే చేయాలి. నేను అలాగే చేస్తాను. ప్రజల గురించి పట్టించుకోను. వారు నా గురించి ఏమన్నా ఆలోచిస్తారా? వారికంత టైమ్ ఉందా? అని ప్రశ్నించాడు.

 ప్రజలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటున్నారు? చుట్టుపక్కల వాళ్లు  ఏమనుకుంటున్నారు? అనేది ఆలోచించకూడదని ఒక సలహా కూడా ఇచ్చాడు.  మనం ఎక్కడికైనా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలని అడిగి వెళ్లమంటారా? వద్దా? అని అడగం కదా? అన్నాడు. జీవితం కూడా అంతే…ఒక ప్రయాణం లాంటిదేనని అన్నాడు.

Advertisement

అది అర్థం చేసుకోడానికి కొన్నేళ్లు పట్టవచ్చునని తెలిపాడు.
కొందరికి ఇది అర్థం కావడానికి పదేళ్లు పట్టొచ్చు లేదా ఇరవై ఏళ్లు పట్టొచ్చు. అప్పటికి అర్థమయ్యేసరికి జీవితం అయిపోతుంది. అప్పుడు తీరిగ్గా కూర్చుని 60 ఏళ్ల వయసులో… ఇలా చేసి ఉంటే బాగుండేదని అనుకుంటే ఉపయోగం ఏముంది?

ఏం జరగాలని రాసి పెట్టి ఉంటే, అదే జరుగుతుంది.  ఎవరో ఏదో అనుకుంటారని అనుకుంటే ఎలా? అన్నాడు. వారి కోసం మనం జీవిస్తున్నామా? మన కోసం మనం జీవిస్తున్నామా? అనేది తెలుసుకోవాలి…అని అన్నాడు.

సానియా మీర్జాతో విడాకులు, కొత్త పెళ్లి గురించి చెప్పకుండా ఇలా చెప్పుకు వచ్చాడు. అంతేకాదు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి బయటకు రాలేదని అన్నాడు. వారితో కాంట్రాక్ట్ రద్దు కాలేదని అన్నాడు. కాకపోతే ఫ్రాంచైజీ  ఫార్చ్యూన్ బరిషల్ మాత్రం షోయబ్ ప్లేస్ లో అహ్మద్ షెహజాద్ ని తీసుకుంది. మరి షోయబ్ నిజం చెబుతున్నాడా? లేదా? అనేది కాలమే చెప్పాలి.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×