E-Paper
Advertisement

Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !
Advertisement

Shahid Afridi On Petrol :  పాకిస్తాన్ దేశంలో పెట్రోల్ ధరలు కొండెక్కిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో లీటర్ డీజిల్ ధర 520.35 రూపాయలు కాగా పెట్రోల్ ధరలు లీటర్ కు 458.40 రూపాయలకు చేరుకుంది. దీంతో తీవ్ర స్థాయిలో వాహనదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే పాకిస్తాన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు సమస్య ఉందని.. ధరలు పెరగడం సాధారణమని పేర్కొన్నారు. అన్ని దేశాల కంటే పాకిస్తాన్ లో మెరుగైన పాలన కొనసాగుతోందని.. ధరలు కూడా తక్కువగానే ఉన్నాయని వెల్లడించారు. పెరిగిన ధరలను అందరూ అంగీకరించాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ అఫ్రిది.

Also Read: బుమ్రా బౌలింగ్ లో ఫ‌ర్హాన్‌ 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తాడు..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా పాకిస్తాన్ బార్డ‌ర్‌లో తిరుగుతా

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement

పాకిస్తాన్ దేశంలో చమురు ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆదేశం మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది షాకింగ్ వీడియో రిలీజ్ చేశారు. పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు. యుద్ధం కారణంగా ప్రతి దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉందని వెల్లడించారు. అన్ని దేశాల కంటే పాకిస్తాన్ సర్కార్ ధరలను తక్కువగానే పెంచుతోందని స్పష్టం చేశారు.

అలాగే యుద్ధాన్ని పాకిస్తాన్ చాలా చక్కగా ఎదుర్కొంటుందని కితాబ్ ఇచ్చారు. దేశ పురోగతి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు సర్కార్ తీసుకుంటోంది.. వీటిని పాకిస్తాన్ ప్రజలు భరించాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ అఫ్రిది. పెట్రోల్ లీటర్ 500 కాదు, 2000 రూపాయలు పెరిగినా కూడా భరించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ప్రజలు మండిపడుతున్నారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నావ్ ? పేద వాడి గురించి కూడా ఆలోచించాలి అని చురకలు అంటిస్తున్నారు.

పాకిస్తాన్ లో భారీగా పెరిగిన చమురు ధరలు

Advertisement

ఇరాన్ మొండి వైఖరితో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ లో నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు చమురు ధరలు పెరిగాయి. లేటెస్ట్ గా లీటర్ పెట్రోల్ పైన 42.7% పెంచింది సర్కార్. దీంతో పాకిస్తాన్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 458.40 రూపాయలుగా ఉంది. డీజిల్ పైన 54.9% పెరగడంతో దాని ధర 520 రూపాయలకు చేరుకుంది. అయితే పాకిస్తాన్ లో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ మన ఇండియాలో మాత్రం, ధరలు పెరగడం లేదు. సామాన్యులపై భారం పడకుండా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో పెట్రోల్ ధరలు పెరగలేదు.

 

 

Also Read: IPL 2026: KKRపై స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విజ‌యం..పాకిస్తాన్ లో సంబ‌రాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×