E-Paper
Advertisement

SL vs PAK : చెలరేగిన రిజ్వాన్, షఫీక్..శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో పాక్‌ గెలుపు

SL vs PAK : చెలరేగిన రిజ్వాన్, షఫీక్..శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో పాక్‌ గెలుపు
Advertisement

SL vs PAK: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఈరోజు ఎనిమిదవ మ్యాచ్ లో పాకిస్తాన్ ,శ్రీలంకతో తలపడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక …ఆటగాళ్లు చెలరేగి ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆ తర్వాత చేజింగ్ కు దిగిన పాక్ తొలుత తలబడినా…తరువాత దూకుడుగా ఆడి 48.2 ఓవర్లకే…ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.మహ్మద్ రిజ్వాన్ 131 పరుగులు సాధించగా, అబ్దుల్లా షఫీక్ 113 చేసి పాక్ గెలుపుకు కారణమయ్యారు. ఈ మ్యాచ్ లో పాక్ లంక టీం ను ఓడించి వరల్డ్ కప్ చరిత్ర లోనే అత్యధిక ఛేజింగ్‌ను నమోదు చేసిన టీం గా గుర్తింపు తెచ్చుకుంది.

తొలుత బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక…. విజయం తనదే అన్నంత ధీమాగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.కుషల్ మెండిస్ తన మెరుపు ఇన్నింగ్స్ తో శ్రీలంక స్కోర్ ను పటిష్టంగా మార్చాడు. ఇక ఆ తర్వాత చేజింగ్ కు దిగిన పాక్.. నాల్గవ ఓవర్ లో ఇమామ్-ఉల్-హక్ (12), ఆ తర్వాత కాసేపటికే బాబర్ ఆజం( 10) నిష్క్రమించడంతో కాస్త తడబడింది. మొదటి 10 ఓవర్లు ఆట శ్రీలంక అధిపత్యం లో సాగింది.

Advertisement

11వ ఓవర్ నుంచి క్రీజ్ లో ఉన్న మహ్మద్ రిజ్వాన్,అబ్దుల్లా షఫీక్ పుంజుకోవడంతో లంక బౌలర్లపై ఎదురు దాడులు మొదలయ్యాయి. అయితే లంక ప్లేయర్లు ఏమాత్రం తగ్గకుండా టైట్ ఓవర్లు వేసి పాక్ బ్యాటర్లకు తికమక పెట్టారు. షఫీక్ కాస్త దూకుడు కనబరిచినా..రిజ్వాన్ మాత్రం ఎంతో రిజర్వడ్ గా రన్-ఎ-బాల్ ఆడాడు. 97 బంతులలో సెంచరీ పూర్తి చేసిన అబ్దుల్లా షఫీక్ తన తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు. 

పాక్ బ్యాటర్ల దాడి కి శ్రీలంక బౌలర్స్ బెంబేలు పడ్డారు. శ్రీలంక ప్లేయర్ మతీష పతిరనా పది ఓవర్లలో కేవలం ఒక వికెట్ తీసి ..90 పరుగులు ఇచ్చాడు. ఇది పాక్ టీం కు వరుసగా సెకండ్ విక్టరీ అయితే…శ్రీలంక కు మాత్రం వరుసగా సెకండ్ ఓటమి.దీంతో లంకేయులు కాస్త ఒత్తిడి లో ఉన్నారు. కాగా శ్రీలంక బ్యాటింగ్ ముగిసిన అనంతరం…మెరుపు ఇన్నింగ్స్ తో రికార్డ్స్ పై రికార్డ్స్ బద్దలు కొట్టిన కుషల్ మెండీస్ , డ్రెస్సింగ్ రూమ్ కి వచ్చిన వెంటనే విపరీతమైన చేతి కండరాల నొప్పితో బాధపడడం తో అతన్ని హైదరాబాదులోని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇక అతని ప్లేస్ లో దుషన్ హేమంత సబ్స్టిట్యూట్ గా మైదానంలోకి అడుగు పెట్టగా..సమరవిక్రమ వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వహించాడు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×