E-Paper
Advertisement

Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Pakistan Super League 2026 Tournament ) కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. ఈ రెండు టోర్నమెంటులో ఒకేసారి జరగనున్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లందరూ, ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీ 2026 టోర్నమెంటుకు కీలక ప్లేయర్లు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ స్పందించారు. ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండని అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై (PCB) ఫైర్ అయ్యాడు త‌న్వీర్ అహ్మ‌ద్. ఐపీఎల్ టోర్న‌మెంట్ తో ఇలాగే పెట్టుకుంటే సంక‌నాకి పోతామంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ ( Tanveer Ahmed ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Irfan Pathan On CSK: 44 ఏళ్ల ధోని డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటేనే బెటర్..స‌ర్ఫ‌రాజ్ లాంటి కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వాలి

ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, PSL 2026 రెండు టోర్నమెంట్లు ఒకేసారి జరుగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీన జరగనుంది. మార్చి 26వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ టోర్నమెంట్ లోని జట్లతో డీలింగ్ కుదుర్చుకున్నారు. కానీ ఇదే స‌మ‌యంలో ఐపీఎల్ టోర్న‌మెంట్ ఆడే ప్లేయ‌ర్లు గాయాల బారీన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కో ప్లేయ‌ర్ టోర్న‌మెంట్ నుంచి త‌ప్పుకుంటున్నారు.  దీంతో గాయాల బారీన ప‌డిన‌ ప్లేయ‌ర్ల స్థానంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం పేరు న‌మోదు చేసుకున్న ప్లేయ‌ర్ల‌ను తీసుకుంటున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. దీని వ‌ల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీల‌కు న‌ష్టం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఎప్పుడు కూడా నిర్వహించకూడదని సూచనలు చేశారు. ఒకేసారి రెండు టోర్నమెంట్లు జరగడంతో ఎక్కువగా డబ్బులు సంపాదించే ఐపిఎల్ లోకి విదేశీ క్రికెటర్లు జారుకుంటున్నారని మండిపడ్డారు. దానికి తగ్గట్టుగానే ఐపిఎల్ ఫ్రాంచైజీలు విదేశీ ప్లేయర్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్నాయని ఆరోపణలు చేశారు. దీనివల్ల పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాల్సిన ప్లేయర్ లందరూ ఐపిఎల్ వైపు మొగ్గుచూపి పాకిస్తాన్ కు నష్టం చేస్తున్నారని తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. ఎవడయ్య ఒకేసారి ఐపిఎల్ తో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ పెట్టమన్నది ? వాడికి కొంచమైన బుద్ధి లేదా అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి సీరియస్ అయ్యారు. వచ్చే సీజన్ నుంచి అయినా.. ఐపీఎల్ అయిపోయిన తర్వాత లేదా IPL టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పెడితే లాభం ఉంటుందని తన్వీర్ అహ్మద్ సూచనలు చేశారు.

Advertisement

 

 

Also Read: Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×