E-Paper
Advertisement

Novak Djokovic : జకోవిచ్ సరికొత్త రికార్డు.. 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ కైవసం..

Novak Djokovic : జకోవిచ్ సరికొత్త రికార్డు.. 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ కైవసం..
Advertisement

Novak Djokovic : టెన్నిస్‌లో జకోవిచ్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ అతడి ఖాతాలో చేరింది. రఫెల్ నాదల్‌ (22 టైటిల్స్)ను వెనక్కినెట్టాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నోవాక్ జకోవిచ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

Advertisement

ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 7-6 (7-1), 6-3, 7-5 తేడాతో నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై జకోవిచ్ విజయం సాధించాడు. రూడ్‌ గట్టి పోటీ ఇచ్చినా జకోవిచ్ మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో అనేక రికార్డులు జకోవిచ్ ఖాతాలో చేరాయి. 36 ఏళ్ల 20 రోజుల వయస్సులో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన పెద్ద వయస్సు ఆటగాడిగా‌ నిలిచాడు. ప్రతి గ్రాండ్‌స్లామ్‌ను కనీసం మూడుసార్లు గెలిచిన తొలి ఆటగాడిగా మరో రికార్డు సృష్టించాడు.ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ను 10 సార్లు కైవసం చేసుకున్నాడు. వింబుల్డన్‌ టైటిల్ ను 7 సార్లు గెలిచాడు. యుఎస్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్ లో మూడేసిసార్లు విజేతగా నిలిచాడు.

ప్రతి ఒక్క ఆటగాడు ఒక్కసారైనా గ్రాండ్‌స్లామ్‌ గెలవాలనుకుంటాడని జకోవిచ్ అన్నాడు. కానీ అదృష్టవశాత్తూ తాను 23 సార్లు ఆ ఘనత సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. ఏడేళ్ల వయసులో వింబుల్డన్‌ గెలవాలని, ప్రపంచ నంబర్‌వన్‌ కావాలని కలలు కన్నానని వివరించాడు. కష్టపడితే విజయాలు దక్కుతాయని జకోవిచ్ స్పష్టం చేశాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×