E-Paper
Advertisement

FIFA World Cup : సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్‌దీ అదే రికార్డే!

FIFA World Cup : సఫారీలకు షాకిచ్చిన నెదర్లాండ్స్‌దీ అదే రికార్డే!
Advertisement

FIFA World Cup : T20 వరల్డ్‌కప్‌లో పసికూన నెదర్లాండ్స్, సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించి… ఆ జట్టు సెమీస్ చేరకుండా అడ్డుకుంది. దాంతో.. ప్రతీ వరల్డ్‌కప్‌ మాదిరే… T20 వరల్డ్‌కప్‌ నుంచి కూడా సెమీస్ లేదా అంతకంటే ముందే వెనుదిరిగిన రికార్డును కొనసాగిస్తూ… చోకర్ అనే బిరుదు సార్థకం చేసుకుంది… సౌతాఫ్రికా. క్రికెట్లో ఆ జట్టుకు ఉన్న ఈ చెత్త రికార్డే… ఫుట్‌బాల్‌లో నెదర్లాండ్స్ జట్టుకూ ఉంది.

 

Advertisement

ఫిఫా ర్యాంక్‌లో‌ 8వ స్థానం. వరుసగా గత 15 మ్యాచ్‌‌‌‌ల్లో పరాజయమే ఎరుగని టీమ్. ఇదీ నెదర్లాండ్స్ జట్టు ప్రస్తుత రికార్డులు. కానీ ఇప్పటిదాకా డచ్ టీమ్ ఫిఫా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ను ముద్దాడలేదు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు, కోచింగ్​ స్టాఫ్​ ఉన్నా… క్రికెట్లో సౌతాఫ్రికా జట్టులాగే… నెదర్లాండ్స్ కూడా ఫుట్‌బాల్‌లో కీలక మ్యాచ్‌‌‌‌ల్లో తడబడుతూ ఉంటుంది. 1974, 1978, 2010 ఫిఫా వరల్డ్‌కప్‌ల్లో ఫైనల్ చేరినా… దురదృష్టం వెంటాడటంతో రన్నరప్‌‌‌‌తో సరిపెట్టుకుంది… నెదర్లాండ్స్. అంతేకాదు… ఎక్కువ సార్లు ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్ చేరి ఓడిపోయిన జట్టుగా కూడా నెదర్లాండ్స్ రికార్డు సృష్టించింది.

గత పది వరల్డ్‌కప్‌ల్లో డచ్ టీమ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ దశను దాటింది. కానీ నాకౌట్‌‌‌‌ మొదలవుతుందంటే చాలు… నెదర్లాండ్స్ ‌ప్లేయర్లలో కాన్ఫిడెన్స్‌ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దాంతో… ఈసారైనా డచ్ టీమ్ పాత రికార్డులను బద్దలుకొట్టి ఛాంపియన్ అవుతుందో? లేదో? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఖతార్‌‌‌‌ చేరగానే ప్రాక్టీస్ మ్యాచుల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు… నెదర్లాండ్స్ ప్లేయర్లు. ఫిఫా వరల్డ్‌కప్‌లో గ్రూప్-Aలో ఆతిథ్య ఖతార్‌, సెనెగల్, ఈక్వెడార్‌లతో పోటీ పడనుంది… నెదర్లాండ్స్. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న డచ్ టీమ్… యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో గ్రూప్‌–Gలో అగ్రస్థానంలో నిలిచి మెగా ఈవెంట్‌కు అర్హత పొందింది. ఈసారి ఎలాగైనా ఫైనల్‌ చేరి కప్‌ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు… నెదర్లాండ్స్ ఆటగాళ్లు. మరి ఈ వరల్డ్‌కప్‌లో డచ్ టీమ్ అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×