E-Paper
Advertisement

Netflix start streaming sports : లైవ్ స్ట్రీమింగ్‌కు నెట్‌ఫ్లిక్స్ సిద్ధం.. సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ పేరుతో..

Netflix start streaming sports : లైవ్ స్ట్రీమింగ్‌కు నెట్‌ఫ్లిక్స్ సిద్ధం.. సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ పేరుతో..
Advertisement
Netflix start streaming sports

Netflix start streaming sports : ఈరోజుల్లో ఓటీటీ అనేది థియేటర్లను డామినేట్ చేసేస్తున్నాయి. ఒక సినిమా థియేటర్‌లో విడుదలయిన రెండు వారాలకే.. ఓటీటీలో వచ్చేస్తోంది. పైగా మంచి టాక్ సాధించిన సినిమాను కొనడానికి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మధ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంటోంది. కానీ కేవలం సినిమాల వల్ల తగిన లాభాలు రావడం లేదు అనుకుంటున్నాయేమో ఓటీటీలు.. అందుకే స్పోర్ట్ వైపు దృష్టిపెట్టాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ పోటీలో జాయిన్ అవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

స్పోర్ట్స్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. కానీ క్రికెట్ ఇచ్చినంత బిజినెస్ ఇంకా ఏ స్పోర్ట్స్ ఇవ్వలేదని భావించాయో ఏమో ఓటీటీలు అన్నీ స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను టెలికాస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే వారందరికీ భిన్నంగా స్పెషల్‌గా సెలబ్రిటీ గోల్ఫ్ లీగ్‌ను ఏర్పాటు చేసి దానిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయాలనుకుంటోంది ఆ ఓటీటీ యాజమాన్యం. త్వరలోనే ఈ టోర్నమెంట్‌ను లాంచ్ చేయడానికి నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తుందట. దీనికోసం ప్రొఫెషనల్ గోల్ఫర్స్‌ను, ఫార్ములా వన్ రేసర్స్‌ను ఎంపిక చేయడానికి సిద్ధపడిందని సమాచారం.

లాస్ వేగస్‌లో ఈ సెలబ్రిటీ గోల్ఫ లీగ్ అనేది జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఇంకా మొదటి దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ విషయంపై స్పందన ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను కవర్ చేయడానికి కూడా ఓటీటీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్.. థర్స్‌డే నైట్ ఫుట్‌బాల్ పేరుతో ఫుట్‌బాల్ గేమ్‌ను స్ట్రీమ్ చేస్తోంది. ఇక యాపిల్ టీవీ కూడా బేస్‌బాల్ గేమ్‌ను స్ట్రీమ్ చేస్తూ స్పోర్ట్స్ లవర్స్‌కు వినోదాన్ని అందిస్తున్నాయి.

Advertisement

నెట్‌ఫ్లిక్స్ అనేది ఇప్పటివరకు పలు స్ట్రీమింగ్ ఈవెంట్స్‌ను సబ్‌స్క్రైబర్లకు అందించింది. ఇప్పటికే క్రిస్ రాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక లైవ్ కామెడీని నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ చేసింది. ప్రస్తుతం ఇతర ఓటీటీలతో పోలిస్తే.. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న క్రేజ్‌కు సబ్‌స్క్రిప్షన్ ప్రైజ్‌లను కూడా ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది. దీంతో పాటు పాస్‌వర్డ్ షేరింగ్, హ్యాకింగ్ విషయంలో కూడా నెట్‌ఫ్లిక్స్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఈ సెలబ్రిటీ గోల్ఫ స్ట్రీమింగ్ వల్ల తన పాపులారిటీ మరింత పెరిగే అవకాశం ఉందని యాజమాన్యం ఆశిస్తోంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×