E-Paper
Advertisement

50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు

50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు
Advertisement

Trolls On Rizwan:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య రెండు టెస్టు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టులో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తికాగా.. మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపటి రోజున చివరి రోజు కాగా, 121 పరుగులు పాకిస్తాన్ సాధించాల్సి ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణిస్తున్న మహమ్మద్ రిజ్వాన్ ను ( Mohammad Rizwan ) బంగ్లాదేశ్ ప్లేయర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అతని ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ కూడా మొదలు పెట్టారు. అతని పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మహమ్మద్ రిజ్వాన్ తో వికెట్ కీపర్ లిటన్ దాస్ గొడవ పెట్టుకోగా… ఆ తర్వాత ప్లేయర్లు అంద‌రూ మాటలతో మూకుమ్మడిగా దాడి చేశారు.

Also Read: Mushfiqur Rahim: కాలితో గ‌ట్టిగా త‌న్నిన ముష్ఫిఖర్ రహీం..10 మీట‌ర్ల దూరంలో ప‌డ్డ‌ హెల్మెట్

50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా మహమ్మద్ రిజ్వాన్ ను దారుణంగా ఆడుకుంటున్నారు. రెండో ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేసిన మహమ్మద్ రిజ్వాన్ ఏకాగ్రత దెబ్బతినేలా బంగ్లా క్రికెటర్లు, రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. మహమ్మద్ రిజ్వాన్ అర్ధ సెంచరీ చేసిన తర్వాత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని హిందీలో బూతులు మాట్లాడారు. మొదట నజ్ముల్ హుస్సేన్ శాంటో ట్రోలింగ్ మొదలు పెట్టాడు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్న మహమ్మద్ రిజ్వాన్ ఫీజులో నుంచి 50 పైసలు కట్ చేయాల్సిందే అంటూ గట్టిగా అరిచాడు. ఇక వెంటనే వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా సీన్ లోకి వచ్చాడు. మహమ్మద్ రిజ్వాన్ బాగా యాక్టింగ్ చేస్తున్నాడు… మనకు కూడా నేర్పిస్తున్నాడు అంటూ ర్యాగింగ్ చేశాడు.

అనంతరం తస్కిన్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఓవరాక్టింగ్ చేసినందుకు 50 పైసలు కట్ చేయాల్సిందే అంటూ పచ్చి బూతులు మాట్లాడాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత పాకిస్తాన్ జట్టులో స్థానం ఖాయం అయిపోయింది… అందుకే ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని తమీమ్ ఇక్బాల్ కూడా కామెంట్ చేశాడు. ఈ క్ర‌మంలో బంగ్లా ప్లేయ‌ర్ల‌పై అంపైర్ కు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఫిర్యాదు చేసాడు. త‌న ఏకాగ్ర‌త దెబ్బ‌తిసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నాడు. ఆ త‌ర్వాత బంగ్లా ప్లేయ‌ర్ల‌ను అంపైర్ మంద‌లించాడు. దీంతో బంగ్లా ఆట‌గాళ్లు సెట్ రైట్ అయ్యారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన ఆడియో, వీడియో వైర‌ల్ గా మారింది.

కీల‌కంగా మారిన రిజ్వాన్ వికెట్

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నేపథ్యంలో రేపు చిట్ట చివరి రోజు మాత్రమే మిగిలి ఉంది. రేపు ఒక్క రోజులో 121 పరుగులు సాధిస్తే పాకిస్తాన్ రెండో టెస్టులో విజయం సాధిస్తుంది. లేకపోతే మూడు వికెట్లు బంగ్లా తీస్తే.. పాకిస్తాన్ ఓటమి పాలు కానుంది. మహమ్మద్ రిజ్వాన్ 75 పరుగులతో ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని అవుట్ చేస్తే అవలీలగా పాకిస్తాన్ పైన బంగ్లా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×