E-Paper
Advertisement

Usman Tariq bowling action: ఎంతకు తెగించార్రా.. త్రో బౌలింగ్ వేసి, ద‌క్షిణాఫ్రికాను ఓడించిన పాక్ బౌల‌ర్ ?

Usman Tariq bowling action: ఎంతకు తెగించార్రా.. త్రో బౌలింగ్ వేసి, ద‌క్షిణాఫ్రికాను ఓడించిన పాక్ బౌల‌ర్ ?
Advertisement

Usman Tariq bowling action: పాకిస్తాన్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 3 టి-20 సిరీస్ లో.. సిరీస్ ని నిర్ణయించే మూడవ టి-20 లో పాకిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. శనివారం రోజు లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను నష్టానికి 139 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.

Also Read: Smriti mandhana: జమీమా సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్న స్మృతి మందాన.. టీమిండియాలో అంతర్యుద్ధం ?

Advertisement

తొలి ఓవర్ రెండవ బంతికే డికాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో హెన్డ్రిక్స్ {34}, ప్రిటోరియస్ {0}, బ్రేవిస్ {21}, బ్రీట్జ్కే {1}, కెప్టెన్ ఫెర్రేరా {29}, లిండే {0}, బోస్చ్ {30}, సిమెలానే {13}, విలియమ్స్ {5} పరుగులు చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 3, సల్మాన్ మిర్జా 1, ఫహీమ్ అష్రఫ్ 2, మహమ్మద్ నవాజ్ 1, ఉస్మాన్ తారీక్ 2 వికెట్లు పడగొట్టారు.

 

దక్షిణాఫ్రికా ఓటమికి త్రో బౌలింగ్ కారణమా..?

Advertisement

ఈ మూడవ టి-20లో పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారీక్ మరోసారి అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ తో చర్చనీయాంశంగా మారాడు. 2024 పాకిస్తాన్ సూపర్ లీగ్ {PSL} ఎడిషన్ సందర్భంగా అంపైర్లు ఇతడి బౌలింగ్ యాక్షన్ పై మొదట ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 2025 పాకిస్తాన్ సూపర్ లీగ్ సమయంలో కూడా మరోసారి అదే బౌలింగ్ తో వార్తల్లో నిలిచిన ఉస్మాన్ తారీక్.. తాజాగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడవ టి-20 లో కూడా తన బౌలింగ్ యాక్షన్ తో చర్చనీయాంశంగా మారాడు. ఈ మ్యాచ్ లో అతడి బౌలింగ్ యాక్షన్ చూసిన క్రీడాభిమానులు.. అంతర్జాతీయ క్రికెట్ లో ఐసిసి ఇటువంటి బౌలింగ్ ని ఎలా అనుమతిస్తుందో అర్థం కావడంలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. త్రో బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికాను ఓడించారని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Australia: ఆ ఒక్క త‌ప్పిదం… ఆస్ట్రేలియాకు చుట్టుకున్న ద‌రిద్రం.. ఇక అనుభ‌వించాల్సిందే

పాకిస్తాన్ గెలుపు:

ఇక ఈ మూడవ టి-20లో 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 19 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫర్హాన్ {19}, బాబర్ అజామ్ {68}, సల్మాన్ అఘా {33} పరుగులతో రాణించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. బాబర్ అజామ్ 13 ఇన్నింగ్స్ ల తర్వాత తన మొదటి టి-20 హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మూడు టి-20ల ఈ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా మొదటి మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో పాకిస్తాన్ ని ఓడించింది. ఇక రెండవ టి-20 లో ఆతిథ్య పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది. కాగా శనివారం రోజు జరిగిన మూడవ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన పాక్ సిరీస్ ని కైవసం చేసుకుంది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×