E-Paper
Advertisement

MS Dhoni: పెళ్లంటే స‌ర్గం కాదు న‌ర‌కమే… ధోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MS Dhoni: పెళ్లంటే స‌ర్గం కాదు న‌ర‌కమే… ధోని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వింటే క్రికెట్ అభిమానులలో ఓ రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యి చాలా సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు కేవలం ఐపిఎల్ లో రెండు లేదా రెండున్నర నెలలు మాత్రమే క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటాడు. అయినప్పటికీ అతడు అభిమానుల మధ్య ఎప్పుడూ చర్చలోనే ఉంటాడు. ఐపీఎల్ లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోని.

Also Read: Maxwell: SRH లోకి విధ్వంసకర ఆల్ రౌండర్?

Advertisement

ఎన్నోసార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ప్లే ఆఫ్స్ కి చేర్చిన కెప్టెన్ కూల్.. మైదానంలోనే ఎంత కూల్ గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. ఇక తన అభిమానులను సరదాగా ఆటపట్టిస్తూ గొప్ప అనుభూతులను పంచే ధోని.. ఏం చేసినా సంచలనమే. ధోని తన భార్యతో కలిసి ఫోటోకి ఫోజు ఇచ్చినా, తన కూతురితో ఆడుకున్నా, తన పెంపుడు జంతువులతో టైమ్ పాస్ చేసినా, మైదానంలోకి దూసుకు వచ్చిన అభిమానిని ఆట పట్టించినా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తారు. ధోని ఏం చేసినా అది హుందాగా, వినయంగా ఉంటుంది. తోటి ప్లేయర్లకు విలువైన సలహాలు ఇస్తూ వారి ప్రతిభను వెలికితీస్తాడు ధోని. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడికి ధోని ఇచ్చిన సలహా నెట్టింట వైరల్ గా మారింది.

 

భర్తలందరి పరిస్థితి ఇంతే:

Advertisement

తాజాగా ఓ పెళ్లి వేడుకకు హాజరైన మహేంద్రసింగ్ ధోని.. అక్కడ వరుడికి ఇచ్చిన సలహా ఆ పెళ్లి పందిరిలో ఉన్న వారందరినీ పగలబడి నవ్వించింది. వివాహం జరిగిన తర్వాత అందరూ భర్తలకు ఒకే రకమైన పరిస్థితి ఎదురవుతుందని ధోని సరదాగా అన్నాడు. వైరల్ గా మారిన ఈ వీడియోలో స్టేజ్ మీద కొత్త జంటతో సరదాగా ధోని మాట్లాడుతూ.. “కొంతమంది నిప్పుతో చెలగాటం ఆడాలని అనుకుంటారు. అలాంటి వాళ్లలో { పెళ్ళికొడుకు ఉత్కర్ష్} ఒకడు. మీరు వరల్డ్ కప్ గెలిచారా..? లేదా..? అన్నది ముఖ్యం కాదు. పెళ్లయ్యాక అందరూ భర్తలకు ఒకే రకమైన పరిస్థితి ఉంటుంది. నాకు కూడా ఈ విషయంలో మినహాయింపు ఉందని అనుకోకండి. నా భార్య కూడా అంతే. ఇక్కడ ఉన్న భర్తల అందరి పరిస్థితి అంతే” అని ధోని అనడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత ధోని పెళ్లికూతురికి ఓ సూచన చేశాడు. ” భర్త కోపంగా ఉన్నప్పుడు మీరు ఏం అనకండి. ఎందుకంటే.. భర్తల కోపం ఐదు నిమిషాలలో చల్లారిపోతుంది” అని సూచించాడు.

 

ధోనిలోని సరదా కోణం మరోసారి బయటపడింది:

వరుడు ఉత్కర్ష్ తో మహేంద్రసింగ్ ధోని మాట్లాడుతూ.. ” నీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాకపోయి ఉంటే.. నేను ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పాను” అన్నాడు. అంటే.. “నీ భార్య అందరిలాగా కాకుండా వేరే అనుకోవద్దు” అని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే వరుడు. ” నా భార్య వేరే కాదు” అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేశారు.

Also Read: Jofra Archer: వీడిది ఇంగ్లాండ్ కాదా.. వెస్టిండీస్ లో పుట్టిన ఆర్చర్ కోసం రూల్స్ మార్చిన ECB.. ఇతని సక్సెస్ స్టోరీ ఇదే

దీంతో ఈ ఫన్నీ సంభాషణ ధోనిలోని సరదా కోణాన్ని మరోసారి బయటపెట్టింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. ధోని భయ్యా.. నువ్వు కూడా మాలో ఒకడివా అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. ఇలా అన్నావ్ ఏంటి భయ్యా.. అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ధోని చేసిన ఈ సరదా వ్యాఖ్యలు భర్తలు అందరి పరిస్థితిని తెలియజేశారని చమత్కరిస్తున్నారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×