E-Paper
Advertisement

MS Dhoni: ఒక్క టైటిల్ గెల‌వ‌డానికి 18 ఏళ్లు ప‌ట్టింది..RCBని దారుణంగా ట్రోల్ చేసిన ధోని

MS Dhoni: ఒక్క టైటిల్ గెల‌వ‌డానికి 18 ఏళ్లు ప‌ట్టింది..RCBని దారుణంగా ట్రోల్ చేసిన ధోని
Advertisement

MS Dhoni:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2025  ( Indian Premier League Tournament 2025 ) విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలవడంపై తాజాగా మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక టైటిల్ గెలవడానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) జట్టుకు 18 సంవత్సరాలు పట్టిందంటూ వ్యాఖ్యానించారు మహేంద్రసింగ్ ధోని. 2025 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నమెంట్ నుంచి వైదొలిగింది చెన్నై సూపర్ కింగ్స్. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం పట్టుదలతో ఆడి 18 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ టైటిల్ గెల్చుకుంది.

Also Read: RCB Players-Indian roads: ఇండియ‌న్ రోడ్ల‌పై RCB లేడీ ప్లేయ‌ర్లు…గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండిరా ? బంగ్లాపై ట్రోలింగ్‌

18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలుకున్న బెంగళూరు

Advertisement

18 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2025 ) గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఏడాదికాలం తర్వాత స్పందించారు మహేంద్రసింగ్ ధోని. గత సంవత్సరం టైటిల్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క టైటిల్ గెలవడానికి 18 సంవత్సరాల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎదురుచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు ఎదురు చూసినప్పటికీ చివరికి టైటిల్ మాత్రం బెంగళూరు గెలవడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి విజయాలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరిన్ని గెలుచుకోవాలని కోరారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. అయితే ధోని వ్యాఖ్యలను కొంతమంది వ్యంగంగా చిత్రీకరిస్తున్నారు. ఒక టైటిల్ గెలవడానికి బెంగళూరు జట్టుకు ఐదు సంవత్సరాలు పట్టిందని.. ధోని హేళన చేసేలా మాట్లాడాడని పోస్టులు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్గా నిలిచి ఏడాది పూర్తయింది.. ఏడాదికాలంగా గుర్తుకురాని బెంగళూరు… ఇప్పుడు ఎలా గుర్తుకు వచ్చిందని మహేంద్రసింగ్ ధోని పై ఫైర్ అవుతున్నారు. బెంగళూరు జట్టును ట్రోలింగ్ చేయడానికి ధోని ఇలా వ్యవహరించాడని మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు వచ్చాయని ధోని హింట్ ఇస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు.

ఛాంపియన్ గా బెంగళూరు జట్టు

Advertisement

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్స్ దాకా వెళ్ళిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, టైటిల్ గెల్చుకుంది. అప్పటి ఫైనల్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు విజయం సాధించింది. ఇది ఇలా ఉండ‌గా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 టోర్నమెంట్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంద‌ట‌. మే 31 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ మేర‌కు షెడ్యూల్ ఖ‌రారు అయింది.

Also Read: Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×