E-Paper
Advertisement

Ms Dhoni: జెర్సీ నెంబ‌ర్ 7 మార్చ‌నున్న MS ధోని..ఐపీఎల్ 2026 కోసం కొత్త అవ‌తారం

Ms Dhoni: జెర్సీ నెంబ‌ర్ 7 మార్చ‌నున్న MS ధోని..ఐపీఎల్ 2026 కోసం కొత్త అవ‌తారం
Advertisement

Ms Dhoni:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఏడో నెంబర్ జెర్సీతో క్రికెట్ ఆడుతున్న మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni), ఆ జెర్సీకి గుడ్ బాయ్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటులో కొత్త నెంబర్ జెర్సీతో రంగంలోకి దిగబోతున్నారట మహేంద్ర సింగ్ ధోని. ఇన్ని రోజులు ఏడవ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోని, ఇకపై ఎనిమిదో నెంబర్ జెర్సీతో సందడి చేయబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా మహేంద్రసింగ్ ధోని కొత్త జెర్సీ ( Ms Dhoni Jersy) ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

ధోని జెర్సీ నెంబర్ నిజంగానే మార్చుతున్నాడా ?

Advertisement

మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడూ లేనిది తన ఫేస్బుక్ అకౌంట్ లో కొత్త వీడియోను పెట్టాడు. ఈ వీడియోలో తన ఏడవ నెంబర్ జెర్సీ స్థానంలో ఎనిమిదో నెంబర్ జెర్సీ రాబోతుందని పేర్కొన్నాడు. ఇది ఓ ప్రమోషన్ వీడియో అని తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా ధోని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు. కొన్ని నెంబర్లు మనతోనే ఉండిపోతాయి.. అందులో జెర్సీ నెంబర్ ఏడు.. తనకు చాలా ముఖ్యమైనదని తెలిపాడు. అయితే చివరి వరకు ఈ నెంబర్ తనతో ఉంటుందని అనుకున్నాను.. కానీ ఈరోజుతో జెర్సీ నెంబర్ 8 కి మారుతున్నట్లు పేర్కొన్నాడు మహేంద్ర సింగ్ ధోని. దీని వెనుక అసలు కారణం త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసి, ఈ వ్యాఖ్యలు చేశాడు మహేందర్ సింగ్ ధోని. దీంతో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఎనిమిదో నెంబర్ జెర్సీతో మహేంద్రసింగ్ ధోని బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు.

మహేంద్ర సింగ్ ధోని జెర్సీ మార్పుపై రకరకాల వార్తలు

మహేంద్ర సింగ్ ధోని తన ఏడో నెంబర్ జెర్సీని ఎనిమిదో నెంబర్ కు మారబోతున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఎనిమిదో నెంబర్ లో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి… ఇప్పుడు ఆ జెర్సీ ధరిస్తున్నాడని అంటున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా కొత్త జెర్సీని ప్రచారం చేస్తున్నాడని.. మరికొంతమంది వాదిస్తున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్ లో ధోని సాధించిన విజయాల నేపథ్యంలో ఇప్పటికే 7 నెంబర్ జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్ ఇచ్చింది. ఆ జెర్సీని మరో ప్లేయర్ కు ఇవ్వబోరన్న మాట‌. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

 

https://www.facebook.com/share/v/1Kz2sSF5B4/

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×