E-Paper
Advertisement

Mohsin Naqvi: ద‌మ్ముంటే, పాకిస్తాన్ లో అడుగుపెట్టి గెల‌వండి..టీమిండియాకు న‌ఖ్వీ స‌వాల్

Mohsin Naqvi: ద‌మ్ముంటే, పాకిస్తాన్ లో అడుగుపెట్టి గెల‌వండి..టీమిండియాకు న‌ఖ్వీ స‌వాల్
Advertisement

Mohsin Naqvi:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల నుంచి ఈ పరిస్థితులు ఉన్నాయి. పహల్గామ్ సంఘటన తర్వాత రెండు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోవడం లేదు. అయితే ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) చైర్మన్ మొహ్సీన్ న‌ఖ్వీ (Mohsin Naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇకపైన అన్ని వరల్డ్ క్లాస్ జట్లతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతుందని వెల్లడించారు. అదే సమయంలో టీమిండియాకు సవాల్ కూడా విసిరారు నక్వి. దమ్ముంటే పాకిస్తాన్ లో అడుగు పెట్టి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. దీంతో మొహ్సీన్ న‌ఖ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

పాకిస్తాన్ లో అడుగుపెట్టి గెల‌వండి..టీమిండియాకు న‌ఖ్వీ స‌వాల్

Advertisement

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా నాలుగేళ్ల‌ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం రిలీజ్ చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ టూర్ ప్రోగ్రాంలో భాగంగా పాకిస్తాన్, అన్ని ప్రధాన జట్లతో సిరీస్ లు ఆడనుంది. కేవలం టీమిండియాతో మినహా మిగిలిన అన్ని అంతర్జాతీయ జట్లతో పాకిస్తాన్ పోరుకు సిద్ధం కానుంది. ఐసీసీ ప్రకటించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం ప్రకారం వచ్చే ఈ నాలుగు సంవత్సరాలలో 133 అంతర్జాతీయ మ్యాచులు ఆడనుంది పాకిస్తాన్. ఇందులో 29 టెస్టులు అలాగే 43 వన్డేలు ఉంటాయి. అటు 56 టీ20లు కూడా ఉండనున్నాయి.

ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లతో స్వదేశంలో అటు విదేశాల్లో ఆడనుంది. అయితే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు మాత్రం జరగవు. ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడతాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉన్న నేపథ్యంలో మొహ్సీన్ న‌ఖ్వీ కీలక ప్రకటన చేశారు. ఇండియా.. పాకిస్తాన్ కు రావాలని తమకు ఉందని వెల్లడించారు. కానీ అక్కడి ప్రభుత్వం టీమిండియాను పంపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లో అత్యంత భద్రత కలిగి ఉందని వివరించారు. టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ కు వ‌స్తే, ఈగ కూడా వాల‌కుండా చూస్తామ‌న్నారు. ద‌మ్ముంటే పాకిస్తాన్ లో అడుగు పెట్టి, టీమిండియా గెల‌వాల‌ని ఛాలెంజ్ విసిరారు.

టీమిండియా చేతిలో పాకిస్తాన్ కు చెత్త రికార్డు

Advertisement

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 2008 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు రద్దు అయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే రెండు జట్లు తలపడ్డాయి. ఇక లేటెస్ట్ గా ఆసియా కప్ 2025 సందర్భంగా పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. మొన్న టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సమయంలో కూడా రెండుసార్లు చావు దెబ్బ కొట్టింది టీమిండియా. ఇలా ఎప్పుడు జరిగిన టీమిండియానే పై చేయి సాధిస్తుంది.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×