E-Paper
Advertisement

PSL ప్లేయ‌ర్ల‌కు కొత్త రూల్స్‌..ఇక‌పై ఈగ కూడా గ‌దిలోకి రావొద్దు..బాత్రూం వెళ్లినా ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే

PSL ప్లేయ‌ర్ల‌కు కొత్త రూల్స్‌..ఇక‌పై ఈగ కూడా గ‌దిలోకి రావొద్దు..బాత్రూం వెళ్లినా ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే
Advertisement

PCB Stricter Rules:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026) పోటీగా నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్  ( PSL ) నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. మొదట నసీమ్ షా వ్యవహారం చోటు చేసుకోగా.. ఆ తర్వాత బాల్ టాంపరింగ్, రహస్యంగా ప్రైవేట్ వ్యక్తులను ప్లేయర్లు కలవడం, పింక్ బాల్ వ్యవహారం లాంటివి తెరపైకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, సికందర్ రాజా ఇద్దరు తమ గదిలో రహస్యంగా నలుగురు వ్యక్తులను కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్  ( PCB) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడే ప్లేయర్లను క్రమశిక్షణలో పెట్టేందుకు కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇకపైన ప్రైవేట్ వ్యక్తులను గదిలోకి తీసుకురాకూడదని వెల్ల‌డించింది. బాత్రూం వచ్చినా పర్మిషన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ క్షణం నుంచే ఈ రూల్స్ అమలు అవుతాయని వెల్లడించింది.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

PSL ప్లేయ‌ర్ల‌కు కొత్త రూల్స్‌..బాత్రూం వెళ్లినా ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలోషాహీన్ అఫ్రిది, సికందర్ రాజా ఉన్న గదిలోకి నలుగురు ప్రైవేట్ వ్యక్తులు వచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్ అయింది. ఈ మేరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడే ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కొత్త రూల్స్ అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇక పైన తమ అనుమతి లేకుండా హోటల్ గదుల్లోకి కుటుంబ సభ్యులను కూడా రానివ్వకూడదని హెచ్చరించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

ఒకవేళ కుటుంబ సభ్యులు వస్తే, 24 గంటల ముందు బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక అనుమతి తీసుకున్నప్పటికీ భార్య, తల్లిదండ్రులు, రక్త సంబంధితులకు మాత్రమే ఆటగాడి గదిలోకి ప‌ర్మిష‌న్‌ ఉంటుందని వెల్లడించింది. ఇక కుటుంబ సభ్యులతో సమావేశం కావాలనుకుంటే, ప్రత్యేకంగా హోటల్ లోని ఒక మీటింగ్ పాయింట్ లో కూర్చోవచ్చని తెలిపింది. ఈ రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా కూడా ఫ్రాంచైజీ తో పాటు ప్లేయర్లపై వేటు తప్పదని హెచ్చరించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

అసలు వివాదం ఏంటి?

Advertisement

బాల్ టాంపరింగ్ జరిగే ఒక రోజు ముందు రాత్రి లాహోర్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది అలాగే ఆ జట్టుకు సంబంధించిన సికందర్ రాజా ఫ్రాంచైజీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నలుగురు ప్రైవేట్ వ్యక్తులను తమ హోటల్ గదిలోకి తీసుకువచ్చారు. ఆ రోజున అర్ధరాత్రి రెండు గంటల వరకు వాళ్లతో చర్చలు చేశారు. ఈ విషయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలిసింది. దీంతో ఇప్పుడు కొత్త రూల్స్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఆ నలుగురు ప్రైవేట్ వ్యక్తులను కలిసిన తర్వాత బాల్ టాంపరింగ్ వ్యవహారం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది.

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×