E-Paper
Advertisement

Mohammed Shami : కోహ్లీనే మించిపోయిన షమి

Mohammed Shami : కోహ్లీనే మించిపోయిన షమి
Advertisement

Mohammed Shami : ఇదేంటి? మేటి బ్యాటర్ అయిన కోహ్లీని… బౌలర్ షమి మించిపోవడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే. ఓ విషయంలో కోహ్లీనే మించిపోయాడు… షమి. టెస్టుల్లో సిక్సర్ల విషయంలో కోహ్లీని అధిగమించాడు… షమి. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో… 3 సిక్సర్లు కొట్టిన షమి… టెస్టుల్లో కోహ్లీ కన్నా ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

భారత ఇన్నింగ్స్‌ చివర్లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న షమి… ఆ తర్వాత ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చెలరేగి ఆడిన షమి… 47 బంతుల్లోనే 3 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఆసీస్‌ స్పిన్నర్లపై షమి విరుచుకుపడిన తీరు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఈ క్రమంలో అతను టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీని అధిగమించాడు. కోహ్లి 104 టెస్ట్ మ్యాచ్‌ల్లో 24 సిక్సర్లు కొడితే.. షమీ కేవలం 60 టెస్టుల్లోనే 25 సిక్సర్లు బాది… కోహ్లీని దాటేశాడు. అంతేకాదు… టెస్ట్ మ్యాచ్ కెరీర్లో రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు… షమి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 56 పరుగులు.

Advertisement

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పేరుతో ఉంది. ఇప్పటిదాకా స్టోక్స్ టెస్టుల్లో 107 సిక్సర్లు కొట్టాడు. ఇక భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉంది. కెరీర్లో ఆడిన టెస్టుల్లో మొత్తం 91 సిక్సర్లు కొట్టాడు… సెహ్వాగ్. అతని రికార్డును అధిగమించే మరో భారత ఆటగాడు దరిదాపుల్లో ఎవరూ లేరు. భారత్ తరఫున టెస్టుల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటిదాకా రోహిత్ శర్మ టెస్టుల్లో 66 సిక్సర్లు కొట్టాడు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×