E-Paper
Advertisement

Mohammed Shami : నేను రిటైర్మెంట్ ఇవ్వను.. ఆసియా కప్ 2025 లో ఆడి తీరుతా.. బీసీసీఐకి షమీ వార్నింగ్

Mohammed Shami : నేను రిటైర్మెంట్ ఇవ్వను.. ఆసియా కప్ 2025 లో ఆడి తీరుతా.. బీసీసీఐకి షమీ వార్నింగ్
Advertisement

Mohammed Shami :  ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 09 న ప్రారంభమై సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు జట్లు టీమ్ లను ఇప్పటికే ప్రకటించాయి. వీటిలో టీమిండియా కూడా టీమ్ ను ప్రకటించింది. వారిలో కొంత మంది టీమిండియా బౌలర్లు ఆసియా కప్ కి ఎంపిక కాలేదు. వారిలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఉన్నారు. వీరిద్దరూ కీలక బౌలర్లు అయినప్పటికీ ఆసియా కప్ కి వీరిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానే వంటి ప్లేయర్లను రిటైర్ మెంట్ కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ స్పందించాడు. తనను విమర్శించే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మహ్మద్ షమీ.

Also Read :  Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Advertisement

నేను ఎందుకు రిటైర్ అవ్వాలి : షమీ 

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ” నేను ఎందుకు రిటైర్ అవ్వాలి..? మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. నా రిటైర్మెంట్ తో ఎవ్వరికీ మేలు కలుగుతుంది..? బోర్ కొట్టిన రోజు వెళ్లిపోతా. జాతీయ జట్టుకు తీసుకోకపోతే డొమెస్టిక్ క్రికెట్ ఉంది. ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉంటాను. నన్ను సెలెక్ట్ చేయనందుకు ఎవ్వరినీ నిందించను. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సత్తా చాటుతా. అందుకోసమే కష్టపడుతున్నా” అని వెల్లడించారు మహ్మద్ షమీ. ఈ బెంగాల్ స్టార్ చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరపున ఆడాడు. కానీ ఆసియా కప్ కి ఎంపిక కాలేదు. గత కొంత కాలంగా ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించిన తన బౌలింగ్ తో మ్యాజిక్ చేయలేకపోయాడు. భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు.

Advertisement

వన్డే వరల్డ్ కప్ కి తిరిగి వస్తా.. 

సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున వికెట్లు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలం చెందడంతో కొన్ని మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం కావడం గమనార్హం. ఇక ఆ తరువాత ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ షమీని సెలెక్ట్ చేయలేదు. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్ యువపేసర్లను సెలెక్ట్ చేశారు. మరోవైపు వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పై కూడా స్పందించాడు షమీ. తనకు ఒకే కల మిగిలి ఉందని.. అది వన్డే వరల్డ్ కప్ గెలవడం అని తెలిపాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తిరిగి భారత్ కి వన్డే వరల్డ్ కప్ ను తీసుకురావాలనుకుంటున్నానని తెలిపాడు. ప్రపంచ కప్ -2023 టైటిల్ ను తృటిలో చేజార్చుకున్నామని.. ఆ టోర్నీలో అన్ని మ్యాచ్ లు గెలిచి ఫైనల్ కి చేరామని.. ఫైనల్ లో ఆస్ట్రేలియా పై విజయం సాధించలేకపోయామని తెలిపాడు. 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×