// // Shami : పొదల్లోకి దూసుకెళ్లిన కారు.. యువకుడిని కాపాడిన షమీ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Shami : పొదల్లోకి దూసుకెళ్లిన కారు.. యువకుడిని కాపాడిన షమీ

Shami : పొదల్లోకి దూసుకెళ్లిన కారు.. యువకుడిని కాపాడిన షమీ
Advertisement
shami

Shami : ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో.. టీమిండియా స్టార్ పేసర్ షమీ.. తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. క్రికెట్ లోనే కాదు.. ఎదుటివారికి సహాయం చేయడం ద్వారా కూడా షమీ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ప్రమాదంలో ఉన్న ఓ యువకుడిని కాపాడిన షమీ.. ఆ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అతడిని కాపాడినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంటూ.. యువకుడిని రక్షించిన వీడియోను షేర్ చేసుకున్నాడు.

శనివారం రాత్రి నైనిటాల్ రోడ్డు వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఆ వెనుకే వెళ్తున్న షమీతో పాటు.. ఇతర వాహనదారులు వెంటనే ప్రమాదాన్ని గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో గాయపడిన యువకుడిని రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన షమీ.. అతను ఎంతో అదృష్టవంతుడు. దేవుడు అతనికి మళ్లీ జీవితాన్నిచ్చాడు అని తెలిపాడు. నైనిటాల్ ఘాట్ రోడ్డు నుంచి అతని కారు ప్రమాదవశాత్తు పొదల్లోకి దూసుకెళ్లగా.. అందులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలిపాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని షమీ వెల్లడించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు.. నీది చాలా మంచి మనసు అంటూ.. షమీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×