// //
Mohammad Rizwan: మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s World Cup tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 21 మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ ఉమెన్స్ మహిళల జట్టు (Pakistan women’s team) ఇప్పటికే ఎలిమినేట్ అయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇక నిన్న ఆస్ట్రేలియా చేతిలో నాలుగవ ఓటమిని కూడా చవిచూసింది పాకిస్తాన్ మహిళల జట్టు. నిన్న ఆస్ట్రేలియా ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. లేటెస్ట్ గా మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) కూడా పాకిస్తాన్ మహిళల జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన పాకిస్తాన్ జట్టుకు ఓడిపోవడం అలవాటు అయిపోయింది… కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడకండి అంటూ మహిళల జట్టుకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఆవేశపడి ఆత్మహ**త్యలు చేసుకునేరు అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.
ఉమెన్స్ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s World Cup tournament) నేపథ్యంలో ఆస్ట్రేలియా చేతిలో నిన్న దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఇప్పటికే టీమిండియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా మూడు మ్యాచ్ లో ఓడిపోయింది పాక్. నిన్న ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 113 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవి చూసింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్ ఓటమిపై మహమ్మద్ రిజ్వాన్ కూడా రియాక్ట్ అయ్యారు. మహిళల టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఓడిపోయామని ఎవరు బాధపడకండి… ఓడిపోవడం అనేది పాకిస్తాన్ జట్టుకు చాలా కామన్ అని వెల్లడించారు.
ఇప్పుడు ఓడిపోయామని, బాధపడి లక్ష్యాలను మిస్ చేసుకోవద్దని కోరారు. భవిష్యత్తు లక్ష్యాల కోసం పోరాటం చేయాలని వెల్లడించారు. ఈ టోర్నమెంటులో జరిగిన వైఫల్యాలను గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకండి అని పేర్కొన్నారు. అయితే టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూడాలన్నారు. ఓడిపోయామని బాధపడుతూ, చేయకూడని పనులు చేయొద్దు అంటూ హెచ్చరించారు. మనో ధైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. పాకిస్తాన్ కు వస్తే మిమ్మల్ని రాళ్లతో కూడా కొడతారు.. అయినా భరించాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు మహమ్మద్ రిజ్వాన్. దీంతో మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.