E-Paper
Advertisement

వివాదంలో రిజ్వాన్…స్టేడియాల్లో అల్లాకు ప్రార్థన‌లు చేయొద్దంటూ ప్ర‌క‌ట‌న‌ !

వివాదంలో రిజ్వాన్…స్టేడియాల్లో అల్లాకు ప్రార్థన‌లు చేయొద్దంటూ ప్ర‌క‌ట‌న‌ !
Advertisement

Mohammad Rizwan: పాకిస్తాన్ క్రికెటర్లు నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. నోరు తెరిస్తే, వివాదమే అన్నట్లుగా వ్యవహారం తయారైంది. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) చేసిన ప్రకటన వివాదంగా మారింది. మహిళా క్రికెటర్లు స్టేడియాలలో ఇకపైన అల్లాకు ( Allah) ప్రార్థనలు చేయకూడదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మహమ్మద్ రిజ్వాన్. ఈ మధ్యకాలంలో జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ (Zimbabwe vs Pakistan) మధ్య మ్యాచ్ లో జరిగినప్పుడు మహిళా క్రికెటర్లు అల్లాకు స్టేడియంలోనే ప్రార్థనలు (‘సజ్దా’) చేసిన సంఘటనలు చూశానని వెల్లడించారు. ఇకపై అలాంటి సంఘటనలు రిపీట్ కాకూడదని కోరారు.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

నిత్యం వివాదాలు, మ‌త‌ప‌రమైన విద్వేశాలే

Advertisement

పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్… ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. సరైన ప్రదర్శన లేక పోవడంతో పాకిస్తాన్ జాతీయ జట్టులో కూడా మహమ్మద్ రిజ్వాన్ కు సరిగ్గా స్థానం దక్కడం లేదు. అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా తన ముల్తాన్ సుల్తాన్స్‌ జట్టును సరిగ్గా లీడ్ చేయలేక విఫలమయ్యాడు. ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న మహమ్మద్ రిజ్వాన్… అటు ముస్లిం మతానికి సంబంధించిన కామెంట్లు కూడా చేస్తున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అందరూ నమాజ్ చేయాల్సిందేనని కండిషన్ కూడా పెట్టాడట. తన జట్టులో ప్రతి ఒక్కరితో నమాజ్ చేయించేవాడట మహమ్మద్ రిజ్వాన్. అయితే అలాంటి మహమ్మద్ రిజ్వాన్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. స్టేడియాలలో సజ్దా నిర్వహించకూడదని మహిళా క్రికెటర్లకు దిశా నిర్దేశం చేశారు.

వివాదంలో రిజ్వాన్…స్టేడియాల్లో అల్లాకు ప్రార్థన‌లు చేయొద్దంటూ ప్ర‌క‌ట‌న‌ !

సాధారణంగా క్రికెట్లో సెంచరీ లేదా అర్థ సెంచరీ చేసిన సమయంలో అల్లాకు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా అందరూ సజ్దా నిర్వహిస్తారు. మహిళా క్రికెటర్లు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇదే విషయం పట్ల మహమ్మద్ రిజ్వాన్ చాలా సీరియస్ అయ్యాడు. జింబాబ్వే తో జరిగిన సిరీస్ సందర్భంగా పాకిస్తాన్ మహిళ క్రికెటర్లందరూ అర్ధ సెంచరీలు, సెంచరీలు చేశారని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మహిళ క్రికెటర్లు స‌జ్దా నిర్వ‌హించార‌ని రిజ్వాన్ వివ‌రించారు. ఈ ఇలా స్టేడియాల్లో బ‌హిరంగంగా స‌జ్దా చేయ‌కూడద‌ని కోరారు. మ‌హిళా క్రికెట‌ర్ల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసి, స‌బ్దా చేసుకునే వెసులుబాటు కల్పించాల‌ని డిమాండ్ చేసారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అప్పుడే మహిళలకు స్వేచ్ఛ ఉంటుందని వ్యాఖ్యానించారు. మతాన్ని గౌరవిస్తున్న పాకిస్తాన్ మహిళా క్రికెటర్ల పట్ల పిసిబి కచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నమాజ్ ఎక్కడ చేస్తే తప్పేంటి? మహిళల కోసం ప్రత్యేక రూములు ఏర్పాటు చేయాలా ? అంటూ రిజ్వాన్ కు కౌంటర్ ఇస్తున్నారు నెటిజెన్స్.

Advertisement

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

 

https://www.facebook.com/photo/?fbid=2054871402045144&set=a.131252447740392

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×