E-Paper
Advertisement

బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌

బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌
Advertisement

Trolls On Rizwan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) సక్సెస్ఫుల్గా ఒకవైపు నడుస్తుంటే.. మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ కూడా కొనసాగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే పసి కూన బంగ్లాదేశ్ చేతిలో మొదటి టెస్ట్ ఓడిన పాకిస్తాన్.. రెండో టెస్ట్ కు సిద్ధమవుతోంది. శనివారం నుంచే ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు షురూ అవుతుంది. ఇలాంటి క్రమంలో ఎలాగైనా గెలవాలన్న కసితో పాకిస్తాన్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో కష్టపడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ పై (Mohammad Rizwan ) దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఫీల్డింగ్ టిప్స్ ఇస్తున్న మహమ్మద్ రిజ్వాన్ పరువు తీస్తున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య శనివారం నుంచి రెండవ టెస్టు ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో శుక్రవారం రోజున ఇరు జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తూ చాలా కష్టపడ్డారు. అయితే ప్లేయర్ లందరూ ప్రాక్టీస్ చేస్తుంటే… బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఫీల్డింగ్ టిప్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు మహమ్మద్ రిజ్వాన్. క్యాచ్ లు ఎలా పట్టాలి ? వికెట్ కీపింగ్ ఎలా చేయాలి ? ఫీల్డింగ్ చేసేటప్పుడు ఎలా దూకుడుగా ఉండాలి అనే దాని పైన బంగ్లాదేశ్ ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో మహమ్మద్ రిజ్వాన్ పై దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి. వీడికి కీపింగ్ చేతకాదు… క్యాచ్లు పట్టడం రాదు… బ్యాటింగ్ ఎలాగో గుండు సున్నా.. ఇలాంటోడు బంగ్లాదేశ్ క్రికెటర్లకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంటని సెటైర్లు పేల్చుతున్నారు. అయినా ఈ వెధవ ద్వారా ట్రైనింగ్ తీసుకొని గొప్పోళ్ళు కావాలనుకోవడం బంగ్లాదేశ్ క్రికెటర్ల తెలివి తక్కువ తనం అంటూ పోస్టులు పెడుతున్నారు.

రెండో టెస్ట్ కు సర్వం సిద్ధం

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ షురూ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో బాబర్ ఆజంను ఆడించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే షాన్ మసూద్ ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని కూడా కోరుతున్నారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షాన్ మసూద్ సారధ్యంలోనే రేపు రెండో టెస్టు ఆడనుంది పాకిస్తాన్. కాగా ఇప్పటికే మొదటి టెస్ట్ ఓడిపోయిన పాకిస్తాన్.. రెండో టెస్ట్ కూడా ఓడిపోతే సిరీస్ కోల్పోనుంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయినా కూడా 1-0 తేడాతో బంగ్లాదేశ్ సిరీస్ గెలుస్తుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా రెండు టెస్టులో పాకిస్తాన్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

 

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×