E-Paper
Advertisement

Rishabh Pant : ధోనీతో పోల్చవద్దని ఏడ్చా.. రిషబ్ పంత్..!

Rishabh Pant : ధోనీతో పోల్చవద్దని ఏడ్చా.. రిషబ్ పంత్..!
Advertisement
Sports news headlines

Rishabh Pant latest news(Sports news headlines): టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యం కుదుటపడుతోంది. దీంతో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. తన ఎమోషనల్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో నన్ను అందరూ ధోనీ, ధోనీ అని పిలిచేవారు.

మొహలీలో జరిగిన ఒక మ్యాచ్‌లో స్టంపింగ్ చేయలేకపోయాను. అయినా సరే, గ్రౌండ్‌లోని అభిమానులు అందరూ అదే పనిగా ధోనీ.. ధోనీ అంటుంటే చాలా ఇబ్బంది పడ్డానని తెలిపాడు.

Advertisement

ఆరోజు నేను హోటల్ రూమ్‌కి వెళ్లి ఏడ్చాను. నాకెందుకిలా జరుగుతోందని తీవ్రంగా మదనపడ్డానని తెలిపాడు. అతనితో నన్ను పోల్చుతున్నారంటే, ఆ స్థాయిలో నేను ఆడాలని అనుకునేవాడినని అన్నాడు. ఇప్పుడు నేను స్టంపింగ్ చేయలేకపోతే, ధోనీకి అగౌరవం వస్తుందని అనుకునేవాడిని.. కానీ నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది, అది నిరూపించుకోవాలని తపన పడేవాడినని అన్నాడు.

నిజానికి నాకు ధోనీ అంటే అపారమైన గౌరవం, అభిమానమని తెలిపాడు. నాకెంతో ఆత్మీయుడని అన్నాడు. ఎవరికీ చెప్పుకోలేని విషయాలను ధోనీతోనే షేర్ చేసుకుంటానని, తనే నాకు విలువైన సలహాలిస్తాడని అన్నాడు. ఇక క్రికెట్‌కి సంబంధించి ఎన్నో విలువైన సలహాలిచ్చాడని, టెక్నిక్‌లు చెబుతాడని, మన ఆటలోని లోపాలను సరిచేస్తాడని అన్నాడు.

Advertisement

నిజానికి ధోనీ నాకు గురువు లాంటివాడని అన్నాడు. కానీ ధోనీతో నన్ను పోల్చడాన్ని అంగీకరించలేనని అన్నాడు. ఎందుకంటే నేను ధోనీ కాదు, నేను రిషబ్ పంత్‌ని అని అన్నాడు. అందరూ ధోనీ పేరు ఎలా స్మరిస్తున్నారో, నా పేరు అలా స్మరించాలని భావిస్తాను. నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని కోరుకుంటాను.

ధోనీలా ఆడుతున్నాడని కాదు, రిషబ్ పంత్‌కి ఒక స్టయిల్, ఒక డిఫరెంట్ ఆటలా ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. కొహ్లీ, రోహిత్ శర్మ, ధోనీ ఇలా ఎవరికి వారు క్రికెట్ ప్రపంచంలో తమ ప్రత్యేకతలను చాటుకున్నారు. నేను అలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అయితే రిషబ్ పంత్ అలా అనుకుంటున్నాడు.

కానీ, తనకిప్పుడు ఆల్రడీ ఒక ఐడెంటిటీ వచ్చేసిందని గుర్తించడం లేదు. తనిప్పుడు గేమ్ ఛేంజర్ అనే పేరు సంపాదించుకున్నాడు. సీనియర్లు సునీల్ గవాస్కర్ దగ్గర నుంచి అందరూ కూడా పంత్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నారని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×