E-Paper
Advertisement

నా అకాడమీలో చేరండి..ఫీల్డింగ్ నేర్పిస్తా, టీమిండియా ప‌రువు తీసిన వాన్‌

నా అకాడమీలో చేరండి..ఫీల్డింగ్ నేర్పిస్తా, టీమిండియా ప‌రువు తీసిన వాన్‌
Advertisement

Michael Vaughan:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటితో టి20 సిరీస్ ముగిసింది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న చిట్టచివరి ఐదవ టి20 ఈ రెండు జట్ల మధ్య జరిగింది. ఇందులోనూ టీమిండియా అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసి 257 పరుగులు చేయగా.. మనోళ్లు 201 పరుగులకే చాప చుట్టేశారు. ఈ క్రమంలో వైట్ వాష్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే, టీమిండియా నిన్న ఓడిపోవడానికి ముఖ్య కారణం చెత్త ఫీల్డింగ్. ఇదే విషయాన్ని మైఖేల్ వాన్ స్పష్టం చేశారు. ఒక్కడుంటే ఒక్కడు కూడా సరిగ్గా ఫీల్డింగ్ చేయలేదని.. అందుకే టీమిండియా చివరి మ్యాచ్ లోను ఓడిపోయిందని బాంబు పేల్చారు. నా అకాడమీలో చేరండి..ఫీల్డింగ్ నేర్పిస్తానంటూ, టీమిండియా ప్లేయ‌ర్ల‌ ప‌రువు కూడా తీశారు మైఖేల్ వాన్ (Michael Vaughan). ఫీల్డింగ్ చేత‌కానీ ద‌ద్ద‌మ్మ‌లు, ఛాంపియ‌న్స్ ఎలా అయ్యారు అంటూ ఆగ్ర‌హించారు. దీంతో మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

ఐదవ టి20 లో టీమిండియా చెత్త ఫీల్డింగ్

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య శనివారం జరిగిన ఐదవ టి20 లో మనోళ్లు చెత్త ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ గురించి పక్కకు పెడితే… ఈసారి ఫీల్డింగ్ లో కూడా తేలిపోయారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను టీమిండియా ఆల్ రౌండర్ శివం దుబే చేజేతులా మిస్ చేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ మూడు పరుగుల వద్దే ఉన్నాడు. అయితే అక్కడ దూబే క్యాచ్ మిస్ చేసిన నేపథ్యంలో… 90 పరుగులు రాబట్టాడు. ఇక ఈశాన్ కిషన్ కూడా… ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ క్యాచ్ వదిలేశాడు. కొత్తగా వచ్చిన షెగ్డే, తిలక్ వర్మ, సబిస్టిట్యూట్ గా వచ్చిన రవి బిస్నోయి, వికెట్ కీపర్ సంజు శాంసన్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ తప్పిదాలే చేశారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వారి స్కోర్ చేయగలిగింది.

నా అకాడమీలో చేరండి..ఫీల్డింగ్ నేర్పిస్తా, టీమిండియా ప‌రువు తీసిన వాన్‌

ఐదో టి20 లో టీమిండియా ప్లేయర్లు చెత్త ఫీల్డింగ్ చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు ఇదేనా..? తనకు డౌట్ గా ఉందంటూ పరువు తీశారు. ఇంత చెత్త ఫీల్డింగ్ పెట్టుకొని మూడేళ్లలో మూడు ఐసీసీ ట్రోఫీలు ఎలా గెలిచారని నిలదీశారు. ఫీల్డింగ్ చేయడం చేతకాకపోతే… నా అకాడమీలో చేరండి అంటూ హితువు పలికారు. వెంటనే, ట్రైనింగ్ ఇస్తానంటూ చురకలు అంటించారు.

Advertisement

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×