E-Paper
Advertisement

Messi Jersey: జెర్సీ పంపిన మెస్సి.. ధోనీ కూతురు ఫుల్ హ్యాపీ..

Messi Jersey: జెర్సీ పంపిన మెస్సి.. ధోనీ కూతురు ఫుల్ హ్యాపీ..
Advertisement

Messi Jersey: ఎక్కడో అర్జెంటీనా. ఇక్కడి జార్ఖండ్. అర్జెంటీనా ఫుట్ బాల్ కెప్టెన్ లియొనెల్ మెస్సి. ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ధోనీ. వారిద్దరినీ కలిపింది ఆట. మెస్సికి ధోనీ బిగ్ ఫ్యాన్. ధోనీ అనే కాదు కోహ్లీ కూడా వీరాభిమానే. మనమంతా క్రికెట్ ప్లేయర్స్ ను ఆరాధిస్తుంటే.. వాళ్లేమో ఫుట్ బాల్ ఆటగాళ్లను ఫాలో అవుతున్నారు. ప్రపంచ కప్ గెలుపుతో మెస్సి.. ఫుట్ బాల్ రారాజుగా మారారు.

కట్ చేస్తే.. ధోనీ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ధోనీ కూతురు జీవా పేరున ఓ పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేస్తే.. అది మెస్సి ధరించే నెంబర్ 10 జెర్సీ. దానిపై..‘జీవా కోసం’ అని రాసుంది. కింద మెస్సి సంతకం కూడా ఉండటంతో ధోనీ ఫ్యామిలీ షాక్. ఆ జెర్సీని ఇన్‌స్టాలో పోస్టు చేసింది ధోనీ కూతురు జీవా.

Advertisement

వాల్డ్ కప్ టైటిల్‌ నెగ్గిన ఆనందంలో మునిగి తేలుతున్న మెస్సి తన అభిమానులు, ఫాలోవర్లను మాత్రం మరిచిపోలేదు. భారత్‌లోనూ అతనికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉండటంతో.. ధోనీ కూతురు జీవాకు.. మెస్సి తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని పంపి తన ప్రేమను చాటాడు. గతంలో కూడా మెస్సి.. బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఇలాంటి జెర్సీనే పంపిచాడు. ధోనీ కూతురికే జెర్సీని పంపించడం.. పబ్లిసిటీ కోసమే అనే వారు కూడా ఉన్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×