E-Paper
Advertisement

Glenn Maxwell: ఫిక్సింగ్ చేసే CSKకు ఆడ‌టం కంటే, Un Sold గా మిగిలిపోవ‌డం బెట‌ర్‌!

Glenn Maxwell: ఫిక్సింగ్ చేసే  CSKకు ఆడ‌టం కంటే, Un Sold గా మిగిలిపోవ‌డం బెట‌ర్‌!
Advertisement

Glenn Maxwell:  ఐపీఎల్ 2026 టోర్నమెంటు మినీ వేలం దగ్గర పడుతున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అందరూ ఫిక్సింగ్ చేసేవాళ్లు ఉంటారని, అలాంటి జట్టులోకి వెళ్లడం దండకే అంటూ బాంబు పేల్చాడు. ఓ పోడ్ కాస్ట్ లో డేంజర్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్, పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: KKR: అన్ని జట్లు తోపు ప్లేయర్లను కొనుగోలు చేస్తే, KKR మాత్రం కోచ్ లను తెచ్చుకుంటుంది.. వీళ్ళు ఏంటో, వీళ్ళ కట్టుబాట్లు ఏంటో

చెన్నైలోకి వెళ్లడం దండగే : గ్లెన్ మాక్స్‌వెల్

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూనే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పరువు తీశాడు గ్లెన్ మాక్స్‌వెల్. తాను ఈసారి అన్ సోల్డ్ గా మిగిలిపోతాను కానీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మాత్రం వెళ్ళబోనని ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అందరూ ఫిక్స‌ర్లు ఉంటారు.. అందుకే గతంలో రెండేళ్ల పాటు బ్యాన్ కూడా విధించినట్లు గుర్తు చేశారు. అలాంటి ఫిక్సింగ్ చేసే మనుషుల మధ్య తాను ఆడలేనని, వాళ్లు ఎన్ని కోట్లు ఇచ్చిన చెన్నైకి ప్రాతినిధ్యం వహించేబోనని వెల్లడించారు. అవసరమైతే అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోతానని తెలిపారు. న్యాయంగా ఆడటం, జట్టు కోసం ప్రాణాలైనా ఇవ్వడం తన లక్ష్యమన్నారు. కానీ ఇలా దొంగాట తన వద్ద నడవదని స్పష్టం చేశారు. దీంతో గ్లెన్ మాక్స్‌వెల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అతని చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్టు ఇదే

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ చాలామందిని ప్లేయర్లను వదిలేసేందుకు సిద్ధమైంది. ఈ లిస్టులో డేంజర్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ ( Glenn Maxwell ) మొదటి వరుసలో ఉన్నాడు. గత సీజన్ లో గాయం అలాగే ఆట తీరు పెద్దగా లేకపోవడంతో ఈ సారి గ్లెన్ మాక్స్‌వెల్ ను వదిలేసేందుకు పంజాబ్ నిర్ణయం తీసుకుందట. స్టోయినిస్, యుజ్వేంద్ర చాహల్, పెర్గ్యూసన్, హర్డి, జమీసన్, అవినాష్, సికిందర్ రాజా, కసిగో రబడా, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్ లాంటి ప్లేయర్లను వదిలేయడానికి సిద్ధమయ్యారట. శ్రేయాస్ అయ్యర్, ప్రభ సిమ్రాన్ సింగ్, నేహళ్ వధేర, శశాంక్ సింగ్, ప్రియాంష్ ఆర్య, హర్షిత్ దీప్ సింగ్ , మార్కోత్ జాన్సన్ మార్కో లాంటి ప్లేయర్లను రిటైన్ చేసుకోనుంది. ఇది ఇలా ఉండ‌గా, గ‌త సీజ‌న్ లో ఫైన‌ల్స్ దాకా వెళ్లి పంజాబ్ కింగ్స్ టీం. కానీ ఫైన‌ల్స్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ చేతిలో ఓడింది శ్రేయాస్ అయ్య‌ర్ టీం.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ,20 ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు, SRH రికార్డ్ బ‌ద్ద‌లు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×