E-Paper
Advertisement

Tanveer Ahmed: బీసీసీఐ త‌ల‌చుకుంటే, పాక్ ప్లేయ‌ర్లను కొని.. PSLను నామరూపాలు లేకుండా చేస్తుంది

Tanveer Ahmed: బీసీసీఐ త‌ల‌చుకుంటే, పాక్ ప్లేయ‌ర్లను కొని.. PSLను నామరూపాలు లేకుండా చేస్తుంది
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament )  అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ ( PSL 2026) రెండు ఒకేసారి ఒకే నెలలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎక్కువ డబ్బులు వచ్చే ఐపీఎల్ వైపు విదేశీ ప్లేయర్లు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఒక్కొక్కరుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి జారుకుని, గాయాల పాలై ఐపీఎల్ కు దూరమైన ఆటగాళ్ల స్థానాల్లోకి విదేశీ క్రికెటర్లు వెళ్తున్నారు. తాజాగా శ్రీలంక ఆటగాడు శ‌నకా ( Shanaka) కూడా పాకిస్తాన్ కు ఇచ్చి ఐపీఎల్ టోర్నమెంట్ లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (IPL ) కారణంగా తమ పాకిస్తాన్ సూపర్ లీగ్ నాశనం అవుతుందని పదే పదే ప్రెస్ మీట్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) షాకింగ్ కామెంట్స్ చేశారు. బీసీసీఐ తలుచుకుంటే పాకిస్తాన్ ప్లేయర్లను కూడా కొనుగోలు చేసి, PSL టోర్నమెంట్ ను నామరూపాలు లేకుండా చేస్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

పాకిస్తాన్ ప్లేయర్లను కొని, PSLను నామరూపాలు లేకుండా చేస్తుంది

Advertisement

ఐపిఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చాలామంది విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు గుడ్ బై చెబుతున్నారు. పాకిస్తాన్ వెళ్లాల్సిన క్రికెటర్లు అందరూ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఒక్కొక్కరు ఇండియా చేరుకుంటున్నారు. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి దగ్గర కోట్లలో డబ్బులు ఉన్నాయని.. వాళ్ళు ఏది చేసినా సక్సెస్ అవుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ ప్లేయర్లను కొనేసి, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను నామరూపాలు లేకుండా చేసే సత్తా బీసీసీఐకి ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

అదే సమయంలో తమ పాకిస్తాన్ ప్లేయర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకోవాలని రిక్వెస్ట్ కూడా చేశాడు తన్వీర్ అహ్మద్. ఒకవేళ బీసీసీఐ అనుమతి ఇస్తే, బాబర్ ఆజం, షాహీన్ అఫ్రీది లాంటి ప్లేయర్లంద‌రూ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను వదిలేసి ఐపీఎల్ లోకి వస్తారని కూడా బాంబు పేల్చారు. ఆ సత్తా కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి దగ్గర ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ మార్చి 26వ తేదీన ప్రారంభం కాబోతోంది. అటు మార్చి 28వ తేదీన ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రెండు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో విదేశీ ప్లేయర్లు ఎక్కువగా ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Advertisement

 

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×