E-Paper
Advertisement

Tanveer Ahmed: బంగ్లాదేశ్ తో జై షా కుట్ర‌లు..అందుకే పాకిస్తాన్ వ‌న్డే సిరీస్ ఓట‌మి!

Tanveer Ahmed: బంగ్లాదేశ్ తో జై షా కుట్ర‌లు..అందుకే పాకిస్తాన్ వ‌న్డే సిరీస్ ఓట‌మి!
Advertisement

Tanveer Ahmed:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ( Bangladesh vs Pakistan) మధ్య నిన్నటితో 3 వన్డేల సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో ( Bangla Bank ODI Series 2026) పాకిస్తాన్ ఘోర ఓటమి చవిచూసింది. 2-1 తేడాతో బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. దీంతో 11 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ పై వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్. అయితే బంగ్లాదేశ్ గ్రాండ్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) కూడా ఈ వన్డే సిరీస్ ఓటమిపై స్పందించారు. 10వ ర్యాంకు ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో జై షా కుట్రలు ప‌న్ని.. పాకిస్తాన్ ను ఓడించాడని బాంబు పేల్చారు. అందుకే 11 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిందని ఆరోపణలు చేశారు.

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

బంగ్లాదేశ్ తో జై షా కుట్ర‌లు..త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం !

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో ఐసీసీ బాస్ జై షా కుట్రలు పన్నాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ ను ఆడకుండా పాకిస్తాన్ చేసిందని, ఐసీసీ కుట్రలు పెట్టుకుందని మండిపడ్డారు. అందుకే బంగ్లాదేశ్ తో చేతులు కలిపి.. పాకిస్తాన్ ను ఓడించారని ఐసీసీపై ఆరోపణలు చేశారు.

బంగ్లాదేశ్ లోని ఢాకా పిచ్ మొత్తం మార్చేశారని.. బంగ్లాదేశ్ కు అనుకూలంగా ఉండేలా సిద్ధం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. లేకపోతే పాకిస్తాన్ విజయం సాధించేదని తెలిపారు. పదవ ర్యాంకు ఉన్న బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం నమ్మసక్యంగా లేదని విమర్శలు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ జట్టును కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ప్లేయర్లు పోను పోను చెత్తగా ప్రదర్శన కనబడుతున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు పైన విజయం సాధించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

మూడో వన్డేలోనూ పాకిస్తాన్ ఓటమి

Advertisement

మొదటి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించగా రెండవ వన్డే మ్యాచ్ లో పాకిస్తాన్ విక్టరీ కొట్టింది. ఇక మూడవ వన్డేలో బంగ్లాదేశ్ చివరి వరకు పోరాడి విజయం సాధించింది. పాకిస్తాన్ పై 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది బంగ్లాదేశ్. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 290 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని చేదించలేక 279 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్. దీంతో బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలిచింది.

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×