E-Paper
Advertisement

Football: మారడోనా ‘ఫుట్‌బాల్‌’కు రూ.19.5 కోట్లు

Football: మారడోనా ‘ఫుట్‌బాల్‌’కు రూ.19.5 కోట్లు
Advertisement

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా పేరు చెప్పగానే గుర్తొచ్చేది… హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌. మారడోనా గోల్ కొట్టిన ఆ ఫుట్‌బాల్‌… కోట్ల రూపాయల ధర పలికింది. లండన్‌లో నిర్వహించిన వేలంలో ఆ ఫుట్‌బాల్‌ ఏకంగా రూ.19.5 కోట్లు పలికింది. ఇన్నాళ్లూ ఆ బంతిని ట్యునీషియాకు చెందిన ఆనాటి మ్యాచ్ రిఫరీ అలీ బిన్ నాసర్ తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆయన వేలానికి పెట్టిన ఆ ఫుట్‌బాల్‌ ఇప్పుడు వేలంలో భారీ ధర పలికింది.

1986 సాకర్‌ వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మారడోనా రెండు గోల్స్‌ చేశాడు. అందులో ఒక గోల్‌ను చేతితో కొట్టాడు. అయితే ఈ విషయాన్ని మొదట ఎవరూ గుర్తించలేదు. తర్వాత అది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌ గోల్‌గా చరిత్రలో నిలబడిపోయింది. అప్పట్లో ఈ గోల్‌ వివాదాస్పదమైనా… మారడోనా అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలబెట్టడంతో అంతా ఆ వివాదాన్ని మరిచిపోయారు.

Advertisement

1986 ఫిఫా వరల్డ్‌కప్‌లో మారడోనా ధరించిన జెర్సీని ఈ ఏడాది ఏప్రిల్‌లో వేలం వేస్తే… అది కూడా భారీ ధర పలికింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై 2-1 గోల్స్ తేడాతో గెలిచి… అర్జెంటీనా సెమీఫైనల్‌ చేరింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ ముగిశాక మారడోనా తన జెర్సీని ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్టీవ్‌ హాడ్జ్‌కు ఇచ్చాడు. దాన్ని ఏళ్ల పాటు జాగ్రత్తగా దాచుకున్న హాడ్జ్‌… గత ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌ సైట్‌లో వేలానికి పెట్టాడు. ఓ అజ్ఞాత వ్యక్తి ఆ జెర్సీని 9.28 మిలియన్ డాలర్లకు… అంటే… భారత కరెన్సీలో 76 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

21 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో, 91 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అర్జెంటీనాకు ప్రాతినిధ్యం వహించిన మారడోనా… 34 గోల్స్ చేశాడు. ఇక 490 అధికారిక క్లబ్ మ్యాచ్ ల్లో… 259 గోల్స్ సాధించాడు. ఫిఫా నిర్వహించిన ఒక ఇంటర్నెట్ సర్వేలో మారడోనా ఇరవయ్యో శతాబ్దపు గొప్ప ఆటగాడిగా నిలిచాడు. అంతేకాడు… ఫిఫా వరల్డ్ ప్లేయర్ల జాబితాలో మారడోనాది నెంబర్ వన్ ప్లేస్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×