E-Paper
Advertisement

Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం
Advertisement

Rohit-Gambhir: రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ పోవడంపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ స్పందించారు. ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మనోజ్ తివారీ. గౌతమ్ గంభీర్ కుట్రల కారణంగానే వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించార‌ని ఆయన బాంబు పేల్చారు. ఛాంపియన్ ట్రోఫీ 2025 గెలిచినప్పటికీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తీసేయడం వెనక గౌతమ్ గంభీర్ హస్తం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మనోజ్ తివారీ.

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

రోహిత్ శర్మ కెప్టెన్సీకి చెక్ పెట్టింది గంభీరే

Advertisement

టీమిండియా జట్టుకు కెప్టెన్ వ్యవహరించి ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మ.. ఛాంపియ‌న్స్ ట్రోఫీ తర్వాత తప్పుకున్నాడు. ఇప్పుడు సాధారణ వన్డే ప్లేయర్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ పోవడం వెనుక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉండవచ్చని మనోజ్ తివారీ అనుమానాలు వ్యక్తం చేశారు. టీమిండియా హెడ్ కోచింగ్ గౌతమ్ గంభీర్ ప్రభావానికి అజిత్ అగార్కర్ లోనై ఉండవచ్చని తెలిపారు.

రోహిత్ శర్మ లాంటి లెజెండ్ క్రికెటర్ ను పక్కన పెట్టడం క్రీడా ధర్మానికి విరుద్ధమని మండిపడ్డారు. రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ ఉంటే గౌతమ్ గంభీర్ ఆటలు సాగబోవని.. అది గుర్తించే, అనుభవం లేని గిల్ కు కెప్టెన్సీ వచ్చేలా చక్రం తిప్పాడని బాంబు పేల్చారు మనోజ్ తివారీ. 2027 వరల్డ్ కప్ ఆడగల సత్తా రోహిత్ శర్మకు ఉందని వివరించారు. అలాంటి ఆటగాడిని పక్కకు పెట్టి గిల్ కు బాధ్యత ఇవ్వడం లాజిక్ లేని నిర్ణయం అని ఫైరయ్యారు. ఇది లెజెండ్ క్రికెటర్ రోహిత్ శర్మను అవమానించడమే అంటూ నిప్పులు చెరిగారు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.

Advertisement

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

బంగ్లాదేశ్ తో ఒక్క మ్యాచ్ కూడా ఆడకండి

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టుతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని టీమిండియా కు రిక్వెస్ట్ పెట్టారు టీమిండియా మాజీ క్రికెట‌ర్‌ మనోజ్ తివారీ. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చాలామంది హిందువులు బంగ్లాదేశ్ లో మరణించారని గుర్తు చేశారు. ఇలా మన హిందువులను చంపిన ఏ జట్టుతో కూడా టీమిండియా క్రికెట్ ఆడకూడదని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ఒకటే కాదు పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా మన హిందువులపై ముఖ్యంగా భారతీయులపై దాడులు జరిగితే ఆ జట్లతో క్రికెట్ ఆడకుండా బ్యాండ్ విధించాలని డిమాండ్ చేశారు మనోజ్ తివారీ. ఈ విష‌యంలో భార‌త క్రికెట్ మండలి దృష్టి పెట్టాల‌ని కోరారు. లేక‌పోతే మ‌నకు వ్యాల్యూ ఉండ‌బోద‌ని వెల్ల‌డించారు.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×