E-Paper
Advertisement

Video: మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే ట్రాక్టర్ తో పిచ్ మొత్తం దున్నేశాడు..షాకింగ్ వీడియో వైర‌ల్

Video: మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే ట్రాక్టర్ తో పిచ్ మొత్తం దున్నేశాడు..షాకింగ్ వీడియో వైర‌ల్
Advertisement

Video:  క్రికెట్… ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట. మన ఇండియాలో క్రికెట్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి టోర్నమెంట్స్ చాలా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు క్రికెట్ అభిమానులే ఉంటారు. క్రికెట్ నేరుగా ఆడకపోయినా టీవీలో ఆయన చూసి ఎంజాయ్ చేసేవాళ్లు ఎక్కువ. అయితే అలాంటి మన ఇండియాలో ప్రతి గల్లీలో క్రికెట్ ఆడుతారు. టోర్నమెంట్లలో కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి పిలవలేదని ఒక్క కారణంతో పిచ్ ను ట్రాక్టర్ తో దున్నేశాడు ( Man Ploughs Cricket Pitch) ఓ రాజకీయ నాయకుడి అనుచరుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా ధారణ్ గావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది చూసిన క్రికెటర్ అభిమానులు షాక్ అవుతున్నారు.

Also Read: Tanveer Ahemed: గిల్ బ్యాట్ల‌లో ర‌బ్బ‌ర్లు…అందుకే అవ‌లీలగా సిక్సులు, బౌండ‌రీలు కొడుతున్నాడు

మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే ట్రాక్టర్ తో పిచ్ మొత్తం దున్నేశాడు

Advertisement

క్రికెట్ అంటే ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న తరుణంలో మహారాష్ట్రలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని జలగావ్ జిల్లా ధారణ్ గావ్ ప్రాంతంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ను కొంత‌మంది రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలోని ప్రారంభించారు. కానీ స్థానికంగా ఉన్న ఓ రాజకీయ అనుచరుడిని పిలవలేదని తెలుస్తోంది. అతనికి సమాచారం ఇవ్వకుండానే ఈ టోర్నమెంట్ ప్రారంభించారట. ఈ విషయం సదరు రాజకీయ నాయకుడి అనుచరుడికి కోపం తెప్పించింది. ఇక ఆ కోపంతో మ్యాచ్ జరుగుతుండగానే ట్రాక్టర్ తో మైదానంలోకి దూసుకు వచ్చాడు ఆ దుర్మార్గుడు.

మైదానంలోకి రావడమే కాకుండా మ్యాచ్ జరుగుతుండగా పిచ్ మొత్తం దున్నేశాడు. దీంతో పిచ్ మొత్తం పాడైపోయింది. మ్యాచ్ కూడా నిలిచిపోయింది. ట్రాక్టర్ తో ఆ రాజకీయ నాయకుడి అనుచరుడు ఇంత దుర్మార్గం చేస్తున్నప్పటికీ ప్లేయర్లు సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. ఎదురు తిరిగితే తమను ఏం చేస్తాడో అన్న భయంతో వణికిపోయారు క్రికెటర్లు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రారంభోత్సవానికి పిలవకపోతే ఇలా ట్రాక్టర్ తో దున్నుతారా ? కొంచెమైనా బుద్ధి ఉందా? అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లను బొక్కలో వేయాలని చేస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు

Advertisement

మ్యాచ్ జరుగుతుండగా విచ్ మొత్తం ట్రాక్టర్ తో దున్నేసిన సంఘటనపై టోర్నమెంట్ నిర్వాహకులు ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను చూపించి కేసు పెట్టారని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Also Read: Sam Billings: న‌మాజ్ చేయాల‌ని రిజ్వాన్ టార్చ‌ర్ చేస్తున్నాడు..డ్రెస్సింగ్ రూంలో న‌ర‌కం చూపిస్తున్నాడు

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×