E-Paper
Advertisement

Mallika Sagar: మినీ వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బ్యాక్ గ్రౌండ్‌ తెలుసా..?

Mallika Sagar:  మినీ వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బ్యాక్ గ్రౌండ్‌ తెలుసా..?
Advertisement

Mallika Sagar: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ మినీ వేలం ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. అబుదాబి వేదికగా వేలం జరగనున్న నేపథ్యంలో 10 ఫ్రాంచైజీలు రెడీ అయ్యాయి. ఇక మినీ వేలం నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకురాలుగా మల్లికా సాగర్ మరోసారి సెలెక్ట్ అయింది. ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ , ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా టోర్నీ వేలాన్ని ఆమె నిర్వహించారు. ఇప్పుడు మినీ వేల నిర్వహించేందుకు కూడా మల్లికా సాగర్ ను ఫైనల్ చేశారు. దీంతో ఇవాళ మల్లికా సాగర్ వేలంలో మెరువనున్నారు.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

ఇంతకీ మల్లికా సాగర్ ఎవరు ?

Advertisement

ఐపీఎల్ వేలం వచ్చినప్పుడు అల్లా సోషల్ మీడియాలో మల్లికా సాగర్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ఇక ఈ మినీ వేలం నేపథ్యంలో మరోసారి ఆమె పేరు తెరపైకి వచ్చింది. దీంతో మల్లికా సాగర్ ఎవరు అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఐపీఎల్, WPL తో పాటు ప్రో కబడ్డీ వేలం జరిగినా కూడా ఈమె నిర్వాహకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆమె అందంగా ఉండటమే కాకుండా ఆకట్టుకునే భాషలో మాట్లాడుతూ ఉంటుంది. వేలంపాట జరిగే సమయంలో చూసే అభిమానులతో పాటు 10 ఫ్రాంచైజీలకు చిట్కాలు చూపిస్తూ ఉంటుంది.

మల్లికా సాగర్ మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. 1975 సంవత్సరంలో జన్మించిన ఆమె ఫ్యామిలీ వృత్తి బిజినెస్. వాళ్ల కుటుంబం ప్రముఖ వ్యాపార రంగంలో దూసుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఫిలడెల్ఫియాలోని బ్రెయిన్ మార్ కాలేజీ నుంచి ఆర్ట్ హిస్టరీలో పట్టభ‌ద్రులు అయ్యారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఆర్ట్ ఆక్ష‌ర‌న్ గా మ‌ల్లికా సాగ‌ర్ తన వృత్తి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగానే ఐపీఎల్ వేలం పాటలోకి యాంకర్ గా వచ్చారు.

ప్రో కబడ్డీ లీగ్ తో మల్లికా సాగర్ కెరీర్ ట‌ర్న్‌

Advertisement

2021లో ప్రో కబడ్డీ లీగ్ ద్వారా క్రీడా వేలం రంగంలోకి అడుగుపెట్టారు. ప్రో కబడ్డీ 8వ సీజన్ వేలంలో నిర్వాహకురాలిగా ఆమె వ్యవహరించారు. దీంతో సక్సెస్ అయిన మల్లికా సాగర్, వెంటనే క్రికెట్ నిర్వాహకురాలిగా మారిపోయారు. 2023 లో జరిగిన మొదటి ఉమెన్స్ ప్రీమియ‌ర్‌ వేలాన్ని మల్లికా సాగర్ నిర్వహించారు. ఆ ఈవెంట్ బాగా సక్సెస్ కావడంతో 2024 అలాగే 2020 ఆరు వేలం పాటలను కూడా మల్లికా సాగర్ నిర్వహించడం జరిగింది.

ఇటు 2023 మినీ వేలంలో హ్యూ ఎడ్మిట్స్ కుప్పకూలాడు. దీంతో తాత్కాలిక యాంకర్ గా మల్లికా సాగర్ అప్పటి వేలాన్ని కొనసాగించారు. దాంతో ఆ ఈవెంట్ బాగా సక్సెస్ అయింది. ఇంకేముంది ఐపీఎల్ 2024 మినీ వేలంతో పాటు ఐపీఎల్ 2025 మెగా వేలానికి కూడా ఆమెను ఫైనల్ చేశారు. ఐపీఎల్ వేలం అంటేనే మల్లికా సాగర్ అన్నట్లుగా ఈవెంట్ ను ఆమె మార్చేశారు. అంతలా జనాలు ఆమెకు అభిమానులు అయిపోయారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ వేలాన్ని కూడా మల్లికా సాగర్ నిర్వహించబోతున్నారు.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×