E-Paper
Advertisement

IPL 2026: రోహిత్ శ‌ర్మ‌ను ముంబై కెప్టెన్ చేయండి..నీతా అంబానీకి బెదిరింపులు

IPL 2026: రోహిత్ శ‌ర్మ‌ను ముంబై కెప్టెన్ చేయండి..నీతా అంబానీకి బెదిరింపులు
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ మరో ఏడు రోజుల్లోనే షురూ అవుతుంది. అంటే మార్చి 28వ తేదీ నుంచి జూన్ మొదటి వారం వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఫస్ట్ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 28వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore ) మధ్య ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నీతా అంబానీ ( Nita Ambani) ఎక్కడ కనబడితే అక్కడ నిలదీస్తూనే ఉన్నారు ముంబై ఇండియన్స్ అభిమానులు. అది సోషల్ మీడియా వేదికగా కూడా కోరుతున్నారు.

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను చేయండి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే టీమిండియా వన్డే కెప్టెన్సీ పోయిన రోహిత్ శర్మకు, ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. హార్దిక్ పాండ్యాను తొలగించి రోహిత్ శర్మకు ఇస్తే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఛాంపియన్ అవుతుందని కోరుతున్నారు.

ఈ మేరకు నీతా అంబానీ ఎక్కడ కనిపించినా అభిమానులు అక్కడే నిలదీస్తున్నారు. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాల్సిందే అని మొండి పట్టు పడుతున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది శిరిడి సాయిబాబా సన్నిధికి నీతా అంబానీ కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడ కూడా సాయిబాబా భక్తులు ఇదే డిమాండ్ను వ్యక్తపరిచారు. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ చేయాలని కోరారు. అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చాలామంది రోహిత్ శర్మకు సపోర్ట్ గా నిలుస్తూ కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నే వ్యవహరిస్తాడని కొంతమంది చెబుతున్నారు. గతంలో లాగానే రోహిత్ శర్మ ఈసారి కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడని అంటున్నారు. బరువు తగ్గి చాలా ఫిట్నెస్ గా మారినప్పటికీ కూడా రోహిత్ శర్మకు ఇంపాక్ట్ ప్లేయర్ ( Impact Player role) రోల్ మాత్రమే వర్తిస్తుందని చర్చ జరుగుతోంది. అంటే ఈ లెక్క‌న మ్యాచ్ జ‌రిగే 40 ఓవ‌ర్ల వ‌ర‌కు స్టేడియంలో రోహిత్ శ‌ర్మ క‌నిపించ‌బోడ‌న్న మాట‌.

Also Read:  Inzamam-ul-Haq: కోహ్లీ యావ‌రేజ్ ప్లేయ‌ర్..వాడి కంటే బెట‌ర్ క్రికెట‌ర్లు పాకిస్థాన్‌లో గల్లీకొకడు ఉంటాడు

 

?igsh=MTRkd3JrMGt3MmF0Yg==

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×