E-Paper
Advertisement

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బ్రేకప్..? నిశ్చితార్థంపై మహికా శర్మ షాకింగ్ పోస్ట్

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బ్రేకప్..? నిశ్చితార్థంపై మహికా శర్మ షాకింగ్ పోస్ట్
Advertisement

Hardik Pandya:  హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీమిండియాలో కీల‌క ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్న హార్దిక్ పాండ్యా, ఇప్పుడు గాయం నుంచి కోలుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగే టీ20ల‌కు ఆడే ఛాన్స్ ఉంది. అయితే, మహికా శర్మ, హార్దిక్ పాండ్యా గత కొద్ది రోజుల నుంచి రిలేషన్ లో ఉన్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా అనేక రకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా, మహిక శర్మ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా కొన్ని రకాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

Also Read: Aus vs Eng Ashes 2025-26 : సెంచరీతో రెచ్చిపోయిన హెడ్.. మొదటి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం.. 2 రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్

మహికా శర్మ చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్

Advertisement

రూమ‌ర్స్ కు తగినట్లుగానే మహిక శర్మ చేతికి రింగ్ కనిపించింది. దాంతో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని మహికా శర్మ చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ ధరించి కనిపించింది అంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఎంగేజ్మెంట్ విషయం పైన మహికా శర్మ సంచలన పోస్ట్ షేర్ చేసుకున్నారు. అవన్నీ కేవలం రూమర్ లేనని మహిక శర్మ అన్నారు. ఎంగేజ్మెంట్ విషయం పైన రియాక్ట్ అవుతూ మహిక శర్మ తాను ప్రతిరోజు మంచి మంచి నగలు ధరిస్తానని చెప్పారు. నేను కేవలం మంచి నగలు మాత్రమే ధరిస్తాను అంతేకానీ నా చేతికి ఉన్న రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్ కాదంటూ ఆ వార్తలను కొట్టి పారేశారు. మా ఇద్దరికీ ఎలాంటి ఎంగేజ్మెంట్ జరగలేదని షేర్ చేసుకున్నారు. ఇటీవలే హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియాలో మహికాతో కలిసి పూజలో కలిసి పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలను హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఆ సమయంలో మహిక శర్మ ఎడమ చేతికి ఉంగరం కనిపించింది. దాంతో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరుపుకున్నారని ఏవో పూజలు చేస్తున్నారంటూ అభిమానులు కామెంట్లు చేశారు. ఈ విషయం పైన మహిక చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఎంగేజ్మెంట్ జరగలేదని మహికా శర్మ రియాక్ట్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయని బ్రేకప్ చెప్పుకున్నారేమోనంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం పైన హార్దిక్ పాండ్యా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. వీరిద్దరూ వివాహం చేసుకుంటే చూడాలని హార్దిక్ పాండ్యా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి జంట ఎంతో చక్కగా ఉందని అంటున్నారు. హార్దిక్ పాండ్యా, మహికా శర్మ వివాహం చేసుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఆ రోజునే పాకిస్తాన్ వ‌ర్సెస్ ఇండియా మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్‌… ఏ గ్రూపులో ఏ జట్లు ఉంటాయంటే?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×