E-Paper
Advertisement

ఐపీఎల్ మ్యాచ్ లో విషాదం, గ్రౌండ్ లోనే కుప్ప‌కూలిన‌ లుంగీ ఎంగిడీ..రంగంలోకి అంబులెన్స్

ఐపీఎల్ మ్యాచ్ లో విషాదం, గ్రౌండ్ లోనే కుప్ప‌కూలిన‌ లుంగీ ఎంగిడీ..రంగంలోకి అంబులెన్స్
Advertisement

Lungi Ngidi Injury:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 30 పైగా మ్యాచులు జరగగా, ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే.. ఢిల్లీ బౌలర్ లుంగీ ఎంగిడీ క్యాచ్ ప‌డుతుండ‌గా తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్ ఆటగాడు ప్రియాంష్ ఆర్య‌ కొట్టిన బంతి మిడాఫ్ లో గాల్లోకి లేచింది. అయితే ఆ బంతిని అందుకునే క్రమంలో లుంగీ ఎంగిడీ వెనకాలకు పడిపోయాడు. ఈ క్రమంలో లుంగీ ఎంగిడీ తలకు బలంగా గాయమైంది. దీంతో అత‌డు నొప్పితో విలవిలలాడిపోయాడు. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన వైద్యులుచ‌ లుంగీ ఎంగిడీకి ప్రాథ‌మిక చికిత్స అందించారు. అయినా కూడా అతడు కోలుకోకపోవడంతో ఆంబులెన్స్ లో ఆస్ప‌త్రికి తరలించారు.

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

ఇర‌గ‌దీసిన కేఎల్ రాహుల్, ఢిల్లీ భారీ స్కోర్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 35వ మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత‌ 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఢిల్లీ క్యాపిటల్స్, 264 పరుగులు సాధించింది. ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ 67 బంతులో 152 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు అలాగే 16 బౌండరీలు ఉన్నాయి. అటు నితీష్ రాణా 44 బంతుల్లో 91 పరుగులు సాధించాడు. ఈ దెబ్బకు 264 పరుగులు సాధించింది ఢిల్లీ. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. నాలుగు ఓవర్లలోనే 80 పరుగులు పైగా సాధించారు.

లుంగీ ఎంగిడీకి తీవ్ర గాయం

పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఢిల్లీ బౌలర్ లుంగీ ఎంగిడీకి తీవ్ర గాయం అయింది. పంజాబ్ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య కొట్టిన ఓ బంతి గాల్లోకి ఎగిరింది. మిడాఫ్ లో గాల్లోకి ఎగిరిన బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు లుంగీ ఎంగిడీ. అయితే ఎర్రటి ఎండ ఉన్న నేపథ్యంలో బంతి సరిగ్గా కనిపించలేదు. ఈ క్రమంలోనే క్యాచ్ అందుకోబోయి వెనకాలకు పడిపోయాడు. ఆ సమయంలో లుంగీ ఎంగిడీ తలకు బలమైన గాయం తాగినట్లు తెలుస్తోంది. అతని పరిస్థితి విషమించిన నేపథ్యంలో మైదానంలోకి అంబులెన్స్ వచ్చింది. లుంగీ ఎంగిడీని ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా తలకు దెబ్బ తగిలిన నేప‌థ్యంలో కంకషన్ సబ్సిటిట్యూట్ తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ క్రమంలో దుష్మంత చమీర బరిలోకి దిగాడు. ఇతడు కూడా విదేశీ బౌలర్ కాబట్టి లుంగీ ఎంగిడీ స్థానంలో అతడికి ఛాన్స్ దక్కింది.

Advertisement

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×