E-Paper
Advertisement

IPL : ముంబైకి షాక్.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం..

IPL : ముంబైకి షాక్.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం..
Advertisement

IPL : క్రీజులో పవర్ హిట్టర్స్ టిమ్ డేవిడ్ , కామెరూన్ గ్రీన్ ఉన్నారు. 19 ఓవర్ లో 19 పరుగులు వచ్చాయి.
ముంబై విజయానికి చివరి ఓవర్ లో 11 పరుగులు కావాలి. ఇక అంతా ముంబై గెలుస్తుందనే అనుకున్నారు. కానీ లక్నో బౌలర్ మోసిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండు డాట్ బాల్స్ , మూడు సింగిల్స్, ఒక టూ.. కేవలం 5 పరుగులే ఇచ్చాడు. దీంతో ముంబై 5 పరుగుల తేడాతో ఓడింది.

Advertisement

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (89 నాటౌట్, 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సులు) అద్భుతంగా ఆడాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా ( 49) స్టొయినిస్ కు మంచి సహకారం అందించాడు. దీంతో లక్నో భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో బెరెన్ డార్ఫ్ 2 వికెట్లు, పియూష్ చావ్లా ఒక వికెట్ తీశారు.

178 పరుగుల లక్ష్య చేధనలో ముంబై దాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ ( 59), రోహిత్ శర్మ (37) తొలి వికెట్ కు 90 పరుగులు జోడించారు. వీళ్లిద్దరూ అవుట్ తర్వాత ముంబై ఒత్తిడికి లోనైంది. సూర్యకుమార్ యాదవ్ (7) , నేహల్ వధేరా (16), విష్ణు వినోద్ (2) తక్కువ స్కోర్ కే అవుట్ కావడంతో ఒత్తిడి మరింత పెరిగిపోయింది.

Advertisement

చివరిలో టిమ్ డేవిడ్ (32, 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు) మెరుపులు మెరిపించినా చివరి ఓవర్ మోసిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో లక్నో గెలిచింది. ఇక చివరి మ్యాచ్ లో గెలిస్తేనే ముంబైకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ఈ విజయంతో లక్నో ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగు ముందుకు వేసింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మార్కస్ స్టొయినిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×