E-Paper
Advertisement

విరాట్ కోహ్లీకి ఇండియాలో ఉండ‌ట‌మే ఇష్టం లేదు..SRH ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

విరాట్ కోహ్లీకి ఇండియాలో ఉండ‌ట‌మే ఇష్టం లేదు..SRH ప్లేయ‌ర్ సంచ‌ల‌నం
Advertisement

Liam Livingstone:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ముగిసిన నేపథ్యంలో విరాట్ కోహ్లీపై సన్ రైజర్స్ హైదరాబాద్ 13 కోట్ల ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ (Liam Livingstone) సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీకి (Virat Kohli) అసలు ఇండియాలో ( India) ఉండడం ఇష్టం లేదని.. బాంబు పేల్చారు. ప్రశాంతమైన జీవితాన్ని విరాట్ కోహ్లీ కుటుంబం కోరుకుంటోంద‌ని… అందుకే లండన్ లో సెటిల్ అయినట్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు లివింగ్ స్టోన్. తాజాగా ఇంగ్లాండ్ ప్లేయర్లతో కలిసి ఓ పాడ్ కాస్ట్ లో లివింగ్ స్టోన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ లండన్ లైఫ్ పైన హాట్ కామెంట్స్ చేశారు. ఇండియాలో కంటే, లండ‌న్ లో ( London) ఉండేందుకు ప్రియారిటీ ఇస్తార‌ని వెల్ల‌డించారు. దీంతో లివింగ్ స్టోన్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

విరాట్ కోహ్లీకి ఇండియాలో ఉండ‌ట‌మే ఇష్టం లేదు -లివింగ్ స్టోన్

Advertisement

టీమిండియా డేంజర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. కేవలం ఐపిఎల్ లేదా వన్డేలు ఉంటేనే ఇండియాకు వచ్చి వెళ్ళిపోతున్నాడు. విరాట్ కోహ్లీ కుమారుడు కూడా లండన్ లోనే జన్మించాడు. త్వరలోనే లండన్ పౌరసత్వం కూడా విరాట్ కోహ్లీ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో విరాట్ కోహ్లీ లండన్ లైఫ్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఇంగ్లాండ్ డేంజర్ ప్లేయర్ లివింగ్ స్టోన్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా అంటే విరాట్ కోహ్లీకి పెద్దగా ఇష్టం ఉండదని… లండన్ లోనే ఉండేందుకు ఆసక్తి చూపిస్తాడని వెల్లడించారు. భారతదేశంలో ఎప్పుడు బిజీ లైఫ్ ఉంటుందని.. ఫ్యాన్స్ హడావిడి ఎక్కువగా ఉండటం చూస్తామ‌న్నారు. ఇక విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదని లివింగ్ స్టోన్ చెప్పుకొచ్చారు.

ఇండియాలో ఏ మూలన కోహ్లీ కనిపించినా, సెల్ఫీలు అంటూ జనాలు ఎగబడతారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఇండియాలో సెక్యూరిటీ పెద్దగా ఉండబోదని.. ప్రశాంతంగా ఉండే లండన్ దేశాన్ని విరాట్ కోహ్లీ ఎంచుకున్నాడని లివింగ్ స్టోన్ చెప్పుకొచ్చారు. తన కుటుంబంతో ప్రశాంతంగా జీవించేందుకు విరాట్ కోహ్లీ ఆసక్తి చూపిస్తాడని కూడా వెల్లడించారు. అందరిలాగా గందరగోల వాతావరణాన్ని అతడు ఎంచుకోడని తెలిపారు. ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే ఉంటాడని వివరించారు. ఇక లివింగ్ స్టోన్ చేసిన వ్యాఖ్యలపై ధోని అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇండియాలో పుట్టి పెరిగి లండన్ లో ఉండడానికి విరాట్ కోహ్లీకి సిగ్గు లేదా ? అంటూ ఫైర్ అవుతున్నారు. కోహ్లీ కంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేంద్ర సింగ్ ధోని… చాలా జాలిగా ఇండియన్ రోడ్లపై తిరుగుతాడని గుర్తు చేస్తున్నారు. ధోనికి లేని ఇబ్బంది విరాట్ కోహ్లీకి ఏమంటుందని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×