E-Paper
Advertisement

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆ బుడ్డోడిని ఆడించండి..రోహిత్ తో క‌లిసి చెడుగుడు ఆడుకుంటాడు

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆ బుడ్డోడిని ఆడించండి..రోహిత్ తో క‌లిసి చెడుగుడు ఆడుకుంటాడు
Advertisement

Kris Srikkanth:  15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటు నుంచి ఈ బుడ్డోడు, సంచలనాలు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఐపీఎల్ టోర్నమెంట్లో వరల్డ్ క్లాసు బౌలర్లకు చుక్కలు చూపించి.. టీమిండియాలో అరంగేట్రం చేసే, అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. అయితే ఇలాంటి క్రమంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ పై క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటినుంచి వరుసగా వైభవ్ టీమిండియాలో అవకాశాలు ఇవ్వాలని.. అదే సమయంలో 2027 వన్డే వరల్డ్ కప్ లో అతడిని తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్డే వరల్డ్ కప్ 2027లో వైభవ్ ఆడితే మాత్రం, రోహిత్ శర్మతో కలిసి బౌలర్లను చెడుగుడు ఆడుకోవడం గ్యారెంటీ అంటూ వ్యాఖ్యానించారు. అందుకే అతనిని తీసుకుంటే బెటర్ అన్నారు.

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

2027 వన్డే వరల్డ్ కప్ లోకి వైభవ్ ? క్రిస్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీకి ప్రాధాన్యత ఇవ్వాలని క్రిస్ శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ టోర్నమెంట్ ల కోసం అతన్ని సెలెక్ట్ చేశారు… ఆ టోర్నమెంట్లలో కచ్చితంగా వైభవ్ ను ఆడించాలని డిమాండ్ చేశారు. టి20లో మనోడు సెటిల్ అయ్యాక.. టెస్టులు ఆడించాలని కోరారు. అనంతరం వన్డేల్లో ఎదగనివ్వాలని రిక్వెస్ట్ చేశారు క్రిస్ శ్రీకాంత్. అలా అంచలంచలుగా వైభవ్ ఎదిగితే టీమిండియా కు మంచి ఫలితాలు వస్తాయన్నారు. వచ్చిన అవకాశాలను కూడా వైభవ్ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

అంతేకాదు 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటులో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చే దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని కోరారు. రోహిత్ శర్మతో కలిసి లెఫ్ట్ హ్యాండర్ గా 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ కు అవకాశం వస్తే బాగుంటుందన్నారు. అతనికి ఎలా బౌలింగ్ వేయాలనే దానిపైన బౌలర్లు మదన పడుతున్నారని.. ఇలాంటి క్రమంలో అతన్ని బరిలోకి దించితే టీమిండియా కు చాలా ప్లస్ అవుతుందని వ్యాఖ్యానించారు. రోహిత్ శర్మ హిట్టింగ్ తో పాటు, వైభవ్ దూకుడు యాడ్ అయితే, టీమిండియా కు తిరిగు ఉండదన్నారు.

Advertisement

ప్రత్యర్థి బౌలర్లను ఈ ఇద్దరు చెడుగుడు ఆడుకోవడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశంపై టీమిడియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వాస్తవంగా టీమిండియా జట్టులో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం చాలామంది పోటీపడుతున్నారు. యశస్వి జైష్వాల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ముగ్గురు కూడా ఓపెనర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి క్రమంలో వైభవ్ ను ఎలా తీసుకుంటారనే ప్రశ్న కూడా ఉంది. మరి బీసీసీఐ పెద్దలు ఎలా ఆలోచిస్తారో చూడాలి.

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×