E-Paper
Advertisement

IPL : ఉత్కంఠ పోరు.. పంజాబ్ పై కోల్‌కతా గెలుపు..

IPL : ఉత్కంఠ పోరు.. పంజాబ్ పై కోల్‌కతా గెలుపు..
Advertisement

IPL : చివరి బంతి వరకు ఉత్కఠంగా సాగిన పోరులో పంజాబ్ కు షాక్ తగిలింది. రింకూ సింగ్ కొట్టిన బౌండరీతో కోల్ కతా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (57) మినహా మరో బ్యాటర్ భారీ స్కోర్ చేయలేదు. కానీ జితేశ్ శర్మ (21), షారుక్ ఖాన్ (21 నాటౌట్), రిషి ధావన్ (19), హర్ ప్రీత్ బ్రార్ (17 నాటౌట్) కాస్త మెరుపులు మెరిపించడంతో పంజాబ్ మంచి స్కోర్ సాధించింది. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, హర్షీత్ రాణా 2 వికెట్లు తీశారు. సుయాశ్ శర్మ, నితీశ్ రాణాకు తలో వికెట్ దక్కింది.

జేసన్ రాయ్ (38), నితీశ్ రాణా (51), రస్సెల్ (42) రాణించడంతో కోల్ కతా లక్ష్యం దిశగా సాగింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య చివరి ఓవర్ ఐదో బంతికి రస్సెల్ అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. కోల్ కతా విజయానికి చివరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఈ దశలో రింకూ సింగ్ మరోసారి మ్యాచ్ విన్నర్ గా మారాడు. చివరి బంతిని రింకూ సింగ్ (21 నాటౌట్) బౌండరికీ తరలించడంతో నైట్ రైడర్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Advertisement

పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్ కు రెండు వికెట్లు దక్కాయి. హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఇల్లీస్ తలో వికెట్ తీశారు. పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసిన రస్సెల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×