E-Paper
Advertisement

IPL : సొంతగడ్డపై హైదరాబాద్ కు షాక్ .. ఉత్కంఠ పోరులో కోల్ కతా విక్టరీ…

IPL : సొంతగడ్డపై హైదరాబాద్ కు షాక్ .. ఉత్కంఠ పోరులో కోల్ కతా విక్టరీ…
Advertisement

IPL : ఈ ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. సొంతగడ్డపై ఓడిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతా 5 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కోల్ కతా జట్టులో కెప్టెన్ నితీశ్ రాణా (42), రింకూ సింగ్ (46) రాణించారు.

Advertisement

హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సన్ , నటరాజన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, మార్ క్రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీశారు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. కెప్టెన్ మార్ క్రమ్ (41), హెన్రిచ్ క్లాసెన్ (36) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేసింది.

Advertisement

హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్ లో 9 పరుగులు మాత్రమే చేయాలి. కానీ 3 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడోతో ఓడిపోయింది. కోల్ కతా బౌలర్లలో శార్ధుల్ ఠాకూర్, వైభవ్ ఆరోరా రెండేసి వికెట్లు తీశారు. హర్షిత్ రాణా, రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్ ను అద్భుతంగా వేసిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×