E-Paper
Advertisement

IND vs WI: తగలరాని చోట తగిలిన బంతి..కుప్ప‌కూలిన కేఎల్ రాహుల్‌…10 అడుగులు ప‌రుగెత్తి

IND vs WI: తగలరాని చోట తగిలిన బంతి..కుప్ప‌కూలిన కేఎల్ రాహుల్‌…10 అడుగులు ప‌రుగెత్తి
Advertisement

IND vs WI:   ఢిల్లీ వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. మరో 58 పరుగులు చేస్తే గ్రాండ్ విక్టరీ కొట్టడం ఖాయం. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు తీవ్ర గాయం అయింది. వెస్టిండీస్ బౌలర్ వేసిన బంతి తగలరాని చోట తగిలింది. దీంతో అక్కడే కుప్పకూలాడు కేఎల్ రాహుల్. ఈ సంఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Sai Sudharsan: బౌండ‌రీ గేట్ ద‌గ్గ‌ర బ‌ర్గ‌ర్ తింటున్న సాయి సుద‌ర్శ‌న్‌…టెస్టు క్రికెట్‌లో ఫాలో ఆన్ అంటే?

గ్రౌండ్ లోనే కుప్పకూలిన కేఎల్ రాహుల్.. తగలరానిచోట తగిలిన బంతి

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ కు తీవ్రమైన గాయమైంది. నిన్న సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి తగలరాని చోట తగిలింది. వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ( Jayden Seales ) వేసిన ఓ అద్భుతమైన బంతి… కేఎల్ రాహుల్ ప్రైవేట్ పార్ట్స్ పై తాకింది. దీంతో అక్కడే కుప్పకూలాడు కేఎల్ రాహుల్. అనంతరం దాదాపు పది అడుగుల వరకు పరిగెత్తి అక్కడే కుప్పకూలాడు. నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో వెంటనే ఫిజియో వచ్చి, కేఎల్ రాహుల్ కు ప్రథమ చికిత్స అందించారు. దాదాపు 15 నిమిషాల తర్వాత కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. ఈ సంఘ‌ట‌న కేఎల్ రాహుల్ 5 ప‌రుగ‌ల వ‌ద్ద ఉన్న‌ప్పుడు చోటు చేసుకుంది. అనంతరం బ్యాటింగ్ చేశాడు.

2025 లో టెస్టుల్లో అదరగొడుతున్న రాహుల్

2025 సంవత్సరంలో కె ఎల్ రాహుల్ ఎక్కువ శాతం టెస్టుల్లోనే ఆడాడు. ఈ నేపథ్యంలోనే అద్భుతమైన ప్రదర్శన కూడా కనబరిచాడు. 8 టెస్టులాడిన రాహుల్ 15 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం 745 టెస్ట్ పరుగులు సాధించాడు. 53.21 యావరేజ్ సంపాదించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండగా మరో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నాడని తెలుస్తోంది.

Advertisement

టెస్ట్ మ్యాచ్ లలో కె ఎల్ రాహుల్ కు అవకాశాలు ఇస్తున్నప్పటికీ వన్డేలు అలాగే టీ20 ల‌లో మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి మొండి చేయి చూపిస్తోంది. మొన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమయంలో కూడా కె.ఎల్ రాహుల్ కు నిరాశ ఎదురయింది. అయినప్పటికీ ఓపిక పడుతూ టెస్టుల్లోనే కొనసాగుతున్నాడు రాహుల్. భారత క్రికెట్ నియంత్రణ మండలి అవకాశం ఇస్తే కచ్చితంగా వినియోగించుకుంటున్నాడు. ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు రాహుల్. అయితే, టీమిండియా వ‌ర్సెస్ ఆసీస్ వ‌న్డే సిరీస్ కు మాత్రం కేఎల్ రాహుల్ సెల‌క్ట్ అయ్యాడు. టీ20ల‌కు మాత్రం కాలేదు.

Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్ల‌బ‌చ్చా…స్మృతి మందాన కండ‌లు చూడండి…పిసికి చంపేయ‌డం ఖాయం !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×