E-Paper
Advertisement

గ్రీన్ కు రూ.25 కోట్లు దండ‌గ..నా మాటే విన‌డం లేదు, వాడు బౌలింగే చేయ‌డం లేదు..ర‌హానే సీరియ‌స్ !

గ్రీన్ కు రూ.25 కోట్లు దండ‌గ..నా మాటే విన‌డం లేదు, వాడు బౌలింగే చేయ‌డం లేదు..ర‌హానే సీరియ‌స్ !
Advertisement

Rahane – Cameron Green:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (IPL 2026) చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ ప్రారంభమై రెండు రోజులు కాగా.. రెండు మ్యాచ్ లు కూడా అద్భుతంగా సాగాయి. ఇక నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ జట్ల ( KKR vs MI)మధ్య ఫైట్ జరిగింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ దారుణంగా ఓడిపోయింది. ఇందులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ( Ajinkya Rahane) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రీన్ కు ( Cameron Green) రూ.25 కోట్లు దండగా అన్నట్లుగానే బాంబు పేల్చారు. గ్రీన్ తన మాట వినడం లేదని కూడా పరోక్షంగా హింట్ ఇచ్చాడు అజింక్య రహానే. దీంతో అజింక్య రహానే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

గ్రీన్  నా మాటే విన‌డం లేదు..ర‌హానే సీరియ‌స్ !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అటు బౌలింగ్ లో దారుణంగా విఫలమైన కేకేఆర్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ.25 కోట్లు పెట్టి ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్ ను కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి ఆల్రౌండర్ చేత ఎందుకు బౌలింగ్ చేయించలేదని అజింక్య రహనేను మ్యాచ్ ప్ర‌జెంటేష‌న్ సంద‌ర్భంగా ప్రశ్నించారు. అయితే దీనిపై అజింక్య‌ రహనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కామెరాన్ గ్రీన్ తన మాట అస్సలు వినడు… దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియాను అడగండి అంటూ బాంబు పేల్చాడు రహానే. దీంతో రహానే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

అజింక్య రహానే వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ?

కామెరాన్ గ్రీన్ ను కేకేఆర్ ఏకంగా రూ. 25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ కాబట్టి ఈ రేంజ్ లో ధర పలికాడు గ్రీన్. అయితే నిన్నటి మ్యాచ్ లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. బ్యాటింగ్ సందర్భంగా కేవలం 18 పరుగులు చేసి, ఔట్ అయ్యాడు. ఇక కష్టాల్లో ఉన్న కేకేఆర్ కోసం బౌలింగ్ మాత్రం చేయలేదు గ్రీన్. అంతర్జాతీయంగా మంచి అనుభవం ఉన్న గ్రీన్ బౌలింగ్ చేసి ఉంటే కేకేఆర్ విజయం సాధించేది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాల మేరకు అతడు బౌలింగ్ చేయలేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

ఇటీవల బ్యాక్ సర్జరీ చేయించుకున్న గ్రీన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే ఆ సర్జరీ కారణంగా బౌలింగ్ చేయకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాలు జారీ చేసిందట. అందుకే ఐపీఎల్లో అతడు బౌలింగ్ చేయడం లేదని అంటున్నారు. కేవలం బ్యాటింగ్ కు మాత్రమే అతడు పనికి వస్తాడన్నమాట. ఇదే విషయాన్ని బయట పెట్టకుండా అజింక్య రహనే పరోక్షంగా సీరియస్ అయ్యారు. గ్రీన్ గురించి ఏదైనా అడిగితే క్రికెట్ ఆస్ట్రేలియాను అడుక్కోండి అంటూ కుండ బద్దలు కొట్టాడు రహానే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహారంపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. 25 కోట్లు పెట్టి వీడితో బౌలింగ్ చేయించకపోతే కేకేఆర్ తీవ్రంగా నష్టపోతుందని అంటున్నారు.

 

 

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×