E-Paper
Advertisement

Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్
Advertisement

Kevin Pietersen-Mohsin Naqvi:  టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( Mens T20 World Cup 2026) నేప‌థ్యంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది పాకిస్తాన్ ( Pakistan ). ఈ టోర్న‌మెంట్ లో ఆడ‌తాం కానీ, ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన ఇండియాతో ( IND vs PAK clash) జ‌రిగే మ్యాచ్ ను మాత్రం బాయ్ కాట్ చేసింది పాకిస్తాన్‌. దీంతో పాకిస్తాన్ తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే, ఇదే అంశంపై ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆట‌గాడు కెవిన్ పీటర్సన్ ( Kevin Pietersen) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ కు అస‌లు సిగ్గులేదంటూ ఫైర్ అయ్యారు. గ్రూప్ స్టేజ్ లో టీమిండియాతో మ్యాచ్ బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌…అదే ఇండియాతో ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే ఏం పీకుతారు అంటూ నిల‌దీశారు ఇంగ్లాండ్ మాజీ స్టార్ ఆట‌గాడు కెవిన్ పీటర్సన్ ( Kevin Pietersen ). అప్పుడు కూడా బాయ్ కాట్ చేసి, ఇంటికి వెళ్లిపోతారా ? అంటూ ప్ర‌శ్నించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ మొహ్సిన్ న‌ఖ్వీకి కొంచెం కూడా తెలివి లేదంటూ ఫైర్ అయ్యారు. న‌ఖ్వీ తెలివి త‌క్కువ ప‌నుల‌కు పాకిస్తాన్ క్రికెట్ నాశనం కాబోతుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read: T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే

ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? : పీట‌ర్స‌న్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఇండియా తో జరిగే మ్యాచ్ ను బహిష్కరించిన పాకిస్తాన్ పై కెవిన్ పీటర్సన్ సీరియస్ అయ్యారు. గ్రూప్ స్టేజ్ లో ఇండియాతో జరిగే మ్యాచ్ ను బహిష్కరిస్తారు.. పర్లేదు, కానీ ఫైనల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వస్తే ఏం చేస్తారని నిలదీశారు. దీనివల్ల క్రీడా స్ఫూర్తికి దెబ్బ అంటూ మండిపడ్డారు. అంతర్జాతీయంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అయ్యాయి.. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆడకుండా వెనక్కి తగ్గితే తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు.

పాకిస్తాన్ తప్పుకుంటే నష్టాలు ఏంటి ?

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాతో జరిగే మ్యాచ్ బాయ్ కాట్ చేస్తే పాకిస్తాన్ కు తీవ్ర స్థాయిలో నష్టాలు జరుగుతాయి. ఈ మ్యాచ్ ను బహిష్కరిస్తే పాకిస్తాన్ పై ఐసీసీ వేటు వేసే ప్రమాదం ఉంది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడకుండా ఆదేశాలు ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. అలాగే బ్రాడ్ కాస్ట‌ర్ల‌కు జరిగే నష్టాన్ని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూడ్చేలా ఆదేశాలు ఉంటాయి. ఐసీసీకి జరిగే నష్టాన్ని కూడా వసూలు చేసే ఛాన్స్ ఉంటుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులో విదేశీ క్రికెటర్లు వెళ్లకుండా ఐసీసీ ఆదేశాలు జారీ చేసే ప్రమాదం పొంచి ఉంది.

Advertisement

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×