E-Paper
Advertisement

SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌
Advertisement

SRH Fans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) సరికొత్త వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ ( Rajasthan Royals vs Hyderabad) జట్ల మధ్య మొన్న ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన సందర్భంగా తెలంగాణ మ్యాప్ ను లేజర్ ద్వారా వేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం తెలంగాణ వాళ్లకు సంబంధించినది అనే అర్థం వ‌చ్చేలా లేజర్ షో వేశారు. దీంతో వివాదం రాజుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం తెలంగాణకు సంబంధించినదేనని… ఏపీకి చెందినది కాదంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి కొంత మంది మాత్రం ఈ లేజర్ షో వేయించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) యాజమాన్యంపై సీరియస్ అవుతున్నారు. దీనికి సంబంధించిన సంఘటన హాట్ టాపిక్ అయింది.

Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ

Advertisement

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దాదాపు 12 సంవత్సరాలు దాటిపోయింది. రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోయినప్పటికీ.. ఈ 12 సంవత్సరాల పాటు అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఎలాంటి గొడవ తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య జరగలేదు. రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాసులు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఇలాంటి నేపథ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం చేసిన ఒక్క తప్పిదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేసింది. రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ మధ్య తాజాగా మ్యాచ్ జరిగిన నేపథ్యంలో SRH టీమ్ కేవలం తెలంగాణకు సంబంధించింది అన్నట్లుగా మ్యాప్ ప్రదర్శించారు.

SRH లోగోతో పాటు తెలంగాణ మ్యాప్ ను లేజర్ షో ద్వారా ప్రదర్శించింది హైదరాబాద్ యాజమాన్యం. ఈ సంఘటన ఏపీ అభిమానులకు కోపం తెప్పించింది. SRH తమ జట్టు అని భావిస్తున్న త‌మ‌ను కించపరిచేలా ఈ లేజర్ షో ప్రదర్శించారని ఏపీ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక SRH జ‌ట్టును ఏపీ వాసులు బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. SRH స్థానంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును ఏపీ ఫ్యాన్స్ స‌పోర్ట్ చేయాల‌ని కోరుతున్నారు. హైద‌రాబాద్ జ‌ట్టుతో మ‌న‌కు సంబంధం తెగిపోయింద‌ని అంటున్నారు.

Advertisement

అటు తెలంగాణకు సంబంధించిన క్రికెట్ అభిమానులు కూడా తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. ఏపీకి సంబంధించిన క్రికెట్ ఫ్యాన్స్ అందరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను అభిమానిస్తారని.. వాళ్లకు SRH జట్టు అంటే అస్సలు పడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు లేజర్ షో తగిన బుద్ధి చెప్పిందని కావ్య పాపను మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ లేజర్ షో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాపకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకుగాను కావ్య పాపపై దేశద్రోహి ముద్ర పడింది. ఇక ఇప్పుడు తెలంగాణ అలాగే ఏపీ అభిమానుల మధ్య చిచ్చు పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కావ్య పాపను ట్రోలింగ్ చేస్తున్నారు.

 

 

 

Also Read:  Ahmed Shehzad: PSLలో వార్న‌ర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయ‌ర్లు త‌ప్ప, ఎవ‌డూ మిగ‌ల‌లేదు

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×